ప్రముఖ దర్శకుడు వి.వి వినాయక్ దర్శకత్వంలో రూపొందిన ఖైదీనెంబర్150 చిత్రం సూపర్‌హిట్ అయ్యింది. సంక్రాంతికి రిలీజైన ఈసినిమా ఇండస్ట్రీ రికార్డులన్నీ బద్దలుకొడుతూ దూసుకుపోతోంది. అయితే ఇప్పుడు వినాయక్ నెక్ట్స్ సినిమా ఏం చెయ్యబోతున్నారనే దానిపై టాలీవుడ్‌లో చర్చ మొదలైంది.
తాజాగా టాలీవుడ్ వర్గాల సమాచారం మేరకు మరోసారి అయన మెగా హీరోతోనే ముందుకు వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి మేనల్లుడు అయిన సుప్రీమ్ స్టార్ సాయి ధరమ్ తేజ్‌తో ఆయన సినిమా తీయనున్నట్లు సమాచారం. వినాయక్ వంటి స్టార్ డైరెక్టర్‌తో సినిమా చేస్తే మాస్ ఇమేజ్ వస్తుందని సాయి ధరమ్ తేజ్ భావిస్తున్నడట. త్వరలో దీనికి సంబంధించి అఫీషయల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. మాస్ సినిమాలు తీయడంలో.. హీరోయిజంను ఎలివేట్ చేయడంలో వినాయక్ ను మించిన డైరెక్టర్ మరొకరు లేరనే విషయంలో సందేహం అవసరం లేదు.
ధరమ్ తేజ్ తో వినాయక్ చేయనున్న సినిమా కూడా మాస్ మూవీనే అని తెలుస్తోంది. ఈసినిమా మార్చిలో మొదలైయ్యే అవకాశలున్నాయట. వరుస హిట్స్ తో జోరు మీదుండి.. ఇటీవలే తిక్క సినిమాతో బోల్తా కొట్టిన సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో విన్నర్ మూవీ చేస్తున్నాడు. వచ్చే నెల 24న విన్నర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ సాయిధరమ్ తన ట్విట్టర్‌లో ట్రైలర్‌ను పోస్ట్ చేశాడు. ఈ ట్రైలర్‌ను ఇప్పటికే 1 మిలియన్ మంది చూశారు. అంతే గాకుండా విన్నర్ లుక్ సూపర్ అంటూ నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. మరోవైపు నక్షత్రం సినిమాలో స్పెషల్ కేరక్టర్ లో తేజు కనిపించనున్నాడు.