దర్శకుడు వినాయక్ చేతిలో పడితే ఏ హీరో అయినా స్టార్ అవ్వాల్సిందే. ఇది ఒకప్పటి మాట. ప్రస్తుతం ఛాన్స్ కోసం వినాయక్ ఆశగా ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అప్పుడెప్పుడో బాలయ్యతో ఓ సినిమా మొదలెట్టాలని ఏడాది పాటు వినాయక్ వర్క్ చేశాడు. కానీ ఎందుకో బాలయ్య మాత్రం వినాయక్ కథను పక్కన పెట్టేసి, మిగిలిన సినిమాలపై, రాజకీయాలపై ఫోకస్ పెట్టాడు. దాంతో వినాయక్ ఖాళీగా ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు వినాయక్ మరో హీరో కోసం వేట మొదలెట్టాడు. చాలా తర్వగా మరో హీరోని ఒప్పించి సినిమాని పట్టాలెక్కించాలని వినాయక్ తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు.
ఆల్ రెడీ వినాయక్ కథ కూడా రెడీ చేసుకున్నాడు. హీరో దొరకడమే బాకీ. ప్రస్తుతం స్టార్ హీరోలంతా బిజీగా ఉన్నారు. అటు సీరియర్లు కూడా వారి వారి ప్రాజెక్టులతో తలమునకలైపోయారు. రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవిని కలిసి కథ కూడా వినిపించాడు. కానీ చిరు మాత్రం వినాయక్ కి డేట్లు ఇచ్చే ఆలోచనలో లేనట్లు కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో వినాయక్ కి హీరో దొరకడం కష్టంగా మారింది. కొత్తవాళ్లతో తీద్దామా అంటే.. ఆ దిశగా ఆలోచించి రిస్క్ చేయడం వినాయక్ కి ఇష్టం లేదు. దొరికిన హీరోలతోనే సర్దుబాటు అవ్వాల్సిన పరిస్థితి.
Also Read:ఇంట్రెస్టింగ్‌గా ‘దిల్ సే’ ట్రైలర్
తనకున్న పరిచయాల దృష్టా.. కాస్తో కూస్తో రేంజ్ ఉన్న హీరోతో ఓ ప్రాజెక్ట్‌ని సెట్ చేయాలన్నది వినాయక్ ఉద్దేశం. ఈసారి కూడా వినాయక్ దృష్టి హీరో రవితేజ పైనే ఉందన్నది ఇన్ సైడ్ వర్గాల టాక్. కాబట్టి, వినాయక్ – రవితేజ కాంబినేషన్ లో మరో సినిమా వస్తే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎలాగూ రవితేజ కూడా వినాయక్ తో సినిమా చేయడానికి ఒప్పుకోవచ్చు. గతంలో తనకు కృష్ణ లాంటి సూపర్ హిట్ మూవీ ఇచ్చాడనే కృతజ్ఞత రవితేజకు ఉంది.
Also Read:కాంగ్రెస్‌లో వెంకటరెడ్డి కథ ముగిసిందా?