ప్చ్.. కాజోల్ కూతురితో ఎన్టీఆర్ అట

19
- Advertisement -

జూనియర్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమాపై ప్రస్తుతానికి అధికారికంగా ఎలాంటి క్లారిటీ లేదు. కానీ, వీళ్ల సినిమా కథేంటి ?, ఎప్పుడు సెట్స్ పైకి వస్తుంది ?.. లాంటి విషయాలపై గాసిప్స్ వస్తూనే ఉన్నాయి. ఇంతవరకు ఓకే. కానీ, ఇండస్ట్రీలో కొన్ని గాసిప్స్ భలే గమ్మత్తుగా ఉంటాయి. అసలుకే దిక్కులేదంటే, కొసరు వార్తలు ఎక్కువగా వినిపిస్తుంటాయి. ఇది కూడా అలాంటిదే. ఎన్టీఆర్ సినిమాలో హీరోయిన్ పై కూడా ఊహాగానాలు మొదలయ్యాయి. సెకండ్ హీరోయిన్ గా కాజోల్ – అజయ్ దేవగన్ కూతురు నైసా దేవగన్ ను తీసుకున్నారట.

ఇదీ ఇప్పుడు బాలీవుడ్ లో వైరల్ అవుతున్న పుకారు. సినిమా ప్రీ-ప్రొడక్షన్ వర్క్ కూడా కంప్లీట్ అవ్వకుండానే, ఎన్టీఆర్ కు ఫుల్ నెరేషన్ ఇవ్వకుండానే, కొంతమంది ఇలా హీరోయిన్ పేరును ఫైనలైజ్ చేసేశారు. అదే కామెడీ. పోనీ.. ఆ హీరోయిన్ గా ఎవరైనా స్టార్ హీరోయిన్ పేరును ప్రచారంలోకి తెస్తే అదో లెక్క. పోనీలే అనుకోవచ్చు. కానీ కాజోల్ కూతురు నైసా దేవగన్ ను పట్టుకొచ్చారు. అజయ్ దేవగన్ తండ్రి కాబట్టి ఆమెకు క్రేజ్ ఉండొచ్చు. కాకపోతే నటిగా ఆమె పరిధి గురించి, ఆమె టాలెంట్ గురించి పెద్దగా ఎవరికీ పరిచయం లేదు.

Also Read:ఇంట్రెస్టింగ్‌గా ‘దిల్ సే’ ట్రైలర్

అలాంటిది నైసా దేవగన్ ను తెరపైకి తీసుకొచ్చి, ఏకంగా ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమాలో హీరోయిన్ ను చేసేశారు. తెలుగులో నైసా దేవగన్ కు పెద్దగా పాపులారిటీ లేదు. ఆమె ఫోటోలు కూడా తెలుగు సోషల్ మీడియాలో పెద్దగా కనిపించవు. అలాంటి హీరోయిన్ ను ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందో కూడా తెలియని ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ మూవీలో హీరోయిన్ గా కన్ ఫర్మ్ చేసేశారు కొంతమంది.

Also Read:

Bigg Boss 7 Telugu:ఆకట్టుకున్న ‘మయాస్త్ర’

- Advertisement -