వివి వినాయక్ @ ఊర్వశి ఓటీటీ

187
urvasi ott
- Advertisement -

కరోనా,లాక్‌ డౌన్‌తో సినీ రంగం కుదేలైన సంగతి తెలిసిందే. ధియేటర్లు మూత పడటం, షూటింగ్‌లకు బ్రేక్ రావడంతో సినీ రంగం భారీ నష్టాలను చవిచూసింది. అయితే ప్రేక్షకులకు వినోదాన్ని అందించేందుకు ఓటీటీ సంస్థలు పెద్ద ఎత్తున ముందుకొచ్చాయి.

అమెజాన్, నెట్ ఫ్లిక్స్, ఆహా ఇలా సినిమాలు ఓటీటీలో రిలీజ్ కావడంతో ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. నూతన సంవత్సర సందర్భంగా మరో ఓటీటీ యాప్ పరిచయం కానుంది. దీనిని ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ లాంచ్ చేయనున్నారు.

దీనికి ఊర్వశి అనే పేరును ఖరారు చేయగా వినాయక్ లాంఛ్ చేస్తుండటంతో మరింత హైప్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం బాలీవుడ్ ఎంట్రీ కోసం సిద్దమవుతున్న వినాయక్‌….. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తెలుగు ఛత్రపతి సినిమాను హిందీలో రీమేక్ చేసేందుకు సిద్దంగా ఉన్నాడు.

- Advertisement -