రైతుల ఆత్మబంధువు సీఎం కేసీఆర్: మంత్రి ఎర్రబెల్లి

28
errabelli

సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి…రైతుల ఆత్మ బంధువన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలంలో సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా రూ.1 కోటి 57 లక్షల 50వేల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. రైతు వేదికలు, పల్లె ప్రకృతి వనాలు, గ్రామ పంచాయతీ భవనాలు, గ్రామ పంచాయతీ షాపింగ్ కాంప్లెక్స్ భవనాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఎర్రబెల్లి…గతంలో ఎన్నడూ జరగని అభివృద్ధి రాష్ట్రంలో సీఎం కేసిఆర్ నేతృత్వంలో జరుగుతుందన్నారు. రైతులకు సీఎం చేసినంతగా ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం, ఏ నాయకుడు చేయలేదన్నారు. మన రాష్ట్రంలో రైతుల కోసం అమలు అవుతున్న అన్ని పథకాలు దేశంలో, మరే రాష్ట్రం లోనూ జరగడం లేదన్నారు.

సాగునీరు, ఉచిత విద్యుత్, పంటల పెట్టుబడి, రుణాల మాఫీ, పంటల కొనుగోలు… ఇలా 18 రకాల పథకాలు అమలు అవుతున్నాయని తెలిపారు. రైతాంగానికి ఉచిత విద్యుత్ కోసం రాష్ట్రం 10వేల కోట్ల సబ్సిడీ ఇస్తున్నామని…ఈ దశలో కేంద్ర ప్రభుత్వం దేశంలో రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటుందన్నారు.