కేసీఆర్ ఆదర్శంగా నిలిచారు..

192
VP Venkaiah praises Kcr
- Advertisement -

ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు తెలుగు బోధన తప్పనిసరి చేసినందుకు సీఎం కేసీఆర్‌కు అభినందనలు తెలిపారు ఉపరాష్ట్రపతి వెంకయ్య.  సీఎంను అభినందిస్తూ వెంకయ్య ట్వీట్ చేశారు.  మాతృభాషలో విద్యా బోధన విషయంలో ఇతర రాష్ట్రాలు తెలంగాణను ఆదర్శంగా తీసుకోవాలని ఆయన సూచించారు. వీలైనంత త్వరలో ఆంధ్రప్రదేశ్ కూడా దీన్ని ఆచరణలో పెడుతుందని ఆశిస్తున్నట్లు వెంకయ్య పేర్కొన్నారు.

హైదరాబాద్‌లో నిర్వహించ తలపెట్టిన ప్రపంచ తెలుగు మహాసభలను పురస్కరించుకొని సీఎం కేసీఆర్.. తెలుగును పరిరక్షించే పలు కీలక నిర్ణయాలను ప్రకటించారు. తెలుగును కచ్చితంగా బోధించే పాఠశాలలకు మాత్రమే తెలంగాణలో అనుమతి ఉంటుందని సీఎం కేసీఆర్‌ మంగళవారం (సెప్టెంబర్ 12) స్పష్టం చేశారు. కోరుకున్న విద్యార్థులకు ఉర్దూ భాష కూడా ఐచ్ఛికంగా ఉండాలని ఆయన సూచించారు.

venkaiah praises kcr
తెలంగాణలో ఇకపై అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు ఇకపై తమ నేమ్ ప్లేట్స్‌ను కచ్చితంగా తెలుగులోనే రాయాలని సీఎం స్పష్టం చేశారు. వీటిపై స్పష్టంగా తెలుగులో రాయాలని, దాని కింద కావాలంటే.. ఇతర భాషల్లో రాసుకోవచ్చని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ నిర్ణయంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయాలకు అతీతంగా పలువురు ప్రశంసలు గుప్పిస్తున్నారు.

- Advertisement -