జూన్‌లో వస్తున్న ఓటర్..

248
- Advertisement -

విష్ణు, సురభి జంటగా అంటించిన ‘ఓటర్‌’ చిత్రం సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికెట్‌ పొందింది. జి.ఎస్‌.కార్తీక్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జాన్ సుధీర్‌ పూదోట నిర్మించారు. జూన్‌లో విడుదల కానున్న ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ..

”ఓటర్‌ చిత్రంపై వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలు. విష్ణు స్నేహితుడు విజయ్‌కుమార్‌ రెడ్డి చెప్తున్న అసెంబ్లీ రౌడీ అగ్రిమెంట్‌పై మాకు ఏ సంబంధం లేదు. ఆ సినిమాకు సంబంధించిన సన్నివేశాలేమీ ఇందులో లేవు. ఓటు విలువ, ఓటర్‌ విలువ గురించి చెప్పే చిత్రమిది. కార్తీక్ చక్కగా తెరకెక్కించారు. చక్కని సందేశంతో పటు వినోదాన్ని పంచె చిత్రమిది ” అని అన్నారు.

Voter

- Advertisement -