చెస్ విజేతలకు బహుమతుల ప్రధానం..

177
Telangana State Chess Competition

హైదరాబాద్ బోట్స్ క్లబ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అండర్ 17 విభాగం నుండి బాల బాలికలకు చెస్ పోటీలు నిర్వహించారు. ఇందులో భాగంగా ట్యాంక్ బండ్ బోట్స్ క్లబ్స్‌లో అండర్ 17 విజేతలకు అమరెందర్ రెడ్డి హైదరాబాద్ బోట్స్ క్లబ్ సెక్రెటరీ, మురళీధర్ రెడ్డి వైస్ ప్రెసిడెంట్, ధరనిదర్ జాయింట్ సెక్రటరీ బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర చెస్ అసోసియేషన్ సెక్రటరీ కె.ఎస్ ప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ మేజర్ శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.