వర్మ నెక్ట్‌ మూవీ టైటిల్‌ ఇదే..!

277
- Advertisement -

విజయవాడలోని పాయకాపురం, పైపులరోడ్డు జంక్షన్ లోప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల ప్రెస్ మీట్ పెట్టేందుకు వెళ్లగా అక్కడి పోలీసులు అడ్డుకుని వెనక్కి పంపిన విషయం తెలిసిందే. అదే ప్లేస్ లో ఈరోజు సాయంత్రం ప్రెస్ మీట్ పెడతానని వర్మ కొన్ని రోజులుగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. అయితే, పైపుల రోడ్డు జంక్షన్ కు బదులు వేరే చోట ఆయన ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్‌ మీట్‌లో వర్మ ఆసక్తికర ప్రకటన చేశారు.

Ram Gopal Varma

ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. తన తదుపరి చిత్రం ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అని ప్రకటించారు. అయితే ‘కమ్మ రాజ్యంలో కడప రౌడీలు’ అని తొలుత ప్రకటించిన వర్మ, తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడం గమనార్హం. విజయవాడ వచ్చిన తర్వాతే తనకు ఈ స్టోరీ ఐడియా వచ్చిందని అన్నారు. విజయవాడ రాగానే బోయపాటి సినిమాలో లా సుమోలు తిరుగుతున్నాయని, కడపలో చూసిన రెడ్లంతా ఇక్కడే ఉన్నారంటూ నవ్వులు కురిపించారు. అందుకే, తనకు ఒక ఇన్సిపిరేషన్ వచ్చిందని, ఇక కథ రాయడం మొదలు పెడతానని వర్మ అన్నారు.

- Advertisement -