హృతిక్ శౌర్య హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘ఓటు’. ‘చాలా విలువైనది’ అనేది ట్యాగ్ లైన్. ఫ్లిక్ నైన్ స్టూడియోస్ నిర్మాణంలో రవి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో తన్వీ నేగి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్, టీజర్, సిరిమల్లె పువ్వా రీమిక్స్ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా మేకర్స్ ఓటు ట్రైలర్ ని విడుదల చేశారు. ‘విద్య వైద్యం వాక్ స్వాతంత్ర్యం ఎలాగైతే మన ప్రాధమిక హక్కులో, మన సమస్యల కోసం పోరాడటం, వాటిని ప్రశ్నించడం కూడా మన ప్రాధమిక హక్కే’’ అనే వాయిస్ తో మొదలైన ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా వుంది. ట్రైలర్ లో సోషల్ ఎలిమెంట్స్ తో పాటు లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా వున్నాయి.
‘ఎప్పుడైతే మనం మన ఓటుని అమ్ముకుంటున్నామో ప్రశ్నించే హక్కుని కోల్పోతున్నాం.‘పది రోజుల ముందు మందు పోసేవాడికి ప్రచారం చేస్తారు. చివరి గ్లాసు పోసేవాడికి ఓటు వేస్తారు’,‘ఒక్కసారి డబ్బు తీసుకోకుండా ఓటు వేసి చూడండి. అప్పుడు మీకే తెలుస్తుంది రాజు ఎవడో సేవకుడు ఎవరో’’ అనే డైలాగ్స్ అలోచింపచేసేలా వున్నాయి.ట్రైలర్ లో హృతిక్ శౌర్య ఇంటెన్స్ రోల్ లో మంచి పెర్ ఫార్మెన్స్ కనబరిచారు. గోపరాజు రమణ కీలక పాత్రలో కనిపించారు. నేపధ్య సంగీతం, కెమరాపనితనం ఆకట్టుకునాయి. ట్రైలర్ బలమైన కంటెంట్ తో సినిమాపై క్యురియాసిటీని పెంచింది.ఫ్లిక్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అగస్త్య సంగీతం అందిస్తున్నారు.
Also Read:యుఎస్‌లో ఆగని ‘మిస్ శెట్టి’