సచిన్‌ని గెలిపించండి: యువీ

364
sachin yuvi
- Advertisement -

భారత స్టార్ బ్యాట్స్‌మెన్ సచిన్‌ను గెలిపించాలని క్రికెట్ ఫ్యాన్స్‌ను కోరారు యువరాజ్ సింగ్. ప్రఖ్యాత లారెస్‌ స్పోర్టింగ్‌ మూమెంట్‌ 2000-2020కు సంబంధించి సచిన్‌ షార్ట్‌ లిస్ట్‌ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సచిన్‌కు ఓటు వేసి గెలిపించాలని కోహ్లితో పాటు పలువురు ఆటగాళ్లు పేర్కొనగా తాజాగా యువీ…క్రికెట్ దేవుడికి ఓటు వేసి గెలిపించాలని అభిమానులను కోరాడు.

సచిన్ కెరీర్‌లో ఎన్నో రికార్డులు నెలకొల్పినా ప్రపంచకప్ సాధించకపోవడం వెలితిగానే మిగిలిపోయింది. ధోని నాయకత్వంలో అద్భత ప్రదర్శన కనబర్చింది టీమిండియా. ఫైనల్లో శ్రీలంకను ఓడించి సచిన్ వెలితిని తీర్చారు. మాస్టర్‌ 19 ఏళ్ల నిరీక్షణ ఫలించడంతో భావోద్వేగానికి గురవుతూ మైదానంలోకి చిన్న పిల్లాడిలా పరిగెత్తుకుంటూ వచ్చిన సన్నివేశం క్రికెట్‌ ప్రేమికులు ఎప్పటికి మరిచిపోరు. అందులోనూ తన హోంగ్రౌండ్‌లో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో విజయం సాధించి భారత్‌ కప్‌ సాధించడంతో సచిన్‌ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

మ్యాచ్‌ అనంతరం టీమిండియా ఆటగాళ్లు యువరాజ్‌, హర్బజన్‌, శిఖర్‌ ధవన్‌ తమ భుజాలపై సచిన్‌ను ఎత్తుకొని గ్రౌండంతా కలియతిరిగడం, తమ అభిమాన ఆటగాడిని తమ భుజాలపై మోసుకెళ్లడం క్రికెట్ అభిమానులకు ఇప్పటికి ఓ మధుర జ్ఞాపకంగా మిగిలిపోయింది.

- Advertisement -