ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో బుధవారం ఉదయం ధ్వజారోహణంతో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 10.30 నుండి 11 గంటల మధ్య మిథున లగ్నంలో పాంచరాత్ర ఆగమశాస్త్రబద్ధంగా గరుడపటాన్ని ప్రతిష్టించి శాస్త్రోక్తంగా ధ్వజారోహణ ఘట్టం నిర్వహించారు. కంకణబట్టర్ శ్రీ రాజేష్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా జేఈఓ శ్రీ వీరబ్రహ్మం మాట్లాడుతూ, ధ్వజారోహణంతో వైభవంగా రాములవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనట్టు తెలిపారు. ఈ ఉత్సవాల్లో ప్రధానంగా ఏప్రిల్ 20న హనుమంత వాహనం, ఏప్రిల్ 22న కల్యాణోత్సవం, ఏప్రిల్ 23న రథోత్సవం, ఏప్రిల్ 25న చక్రస్నానం జరుగుతాయన్నారు.
ఏప్రిల్ 22న సాయంత్రం 6:30 నుండి రాత్రి 8:30 గంటల వరకు శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు చెప్పారు.జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకొని కల్యాణానికి విశేషంగా విచ్చేసే భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేపడతామన్నారు.ఈ సందర్భంగా వేదపండితులు చతుర్వేద పారాయణం చేశారు.
Also Read:నాలుగో విడత నోటిఫికేషన్..తెలుగు రాష్ట్రాల్లో అలర్ట్