టెలికాం రంగంలో జియో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఒక్క దెబ్బతో మిగతా టెలికాం కంపెనీలన్ని కుదేలైపోయాయి. ఉచిత డేటా, ఉచిత వాయిస్ కాల్ ఆఫర్ తో కస్టమర్లంతా జియో వైపు క్యూ కట్టారు. దీంతో దిక్కుతోచని స్థితిలో పడిన టెలికాం కంపెనీలు అనివార్యంగా ఆఫర్లను ప్రకటించాల్సిన పరిస్థితి నెలకొంది.
అయితే రిలయన్స్ జియో ప్రకటించిన 4జీ ఆఫర్స్ మొదలు టెలికాం సంస్థలు ఒక్కొక్కటిగా వినియోగదారులను ఆకర్షించేందుకు ఆఫర్స్‌ను ప్రకటిస్తున్నాయి. ఐడియా, ఎయిర్టెల్ నెట్‌వర్క్‌లు ఇప్పటికే ఆఫర్స్‌ను ప్రకటించగా తాజాగా వొడాఫోన్ కూడా ఈ జాబితాలో చేరింది.
రూ.19 ప్రారంభ ధరతో ఉచిత కాల్స్, 4జీ డేటాను అందిస్తూ సరికొత్త ఆఫర్‌ను తీసుకొచ్చింది. వొడాఫోన్ సూపర్ డే, సూపర్ వీక్ పేరుతో ఈ సదుపాయాన్ని యూజర్లకు అందిస్తోంది. అయితే ఈ అవకాశం కేవలం ప్రీ పెయిడ్ యూజర్లకు మాత్రమే అందిస్తున్నట్లు వొడాఫోన్ తెలిపింది.
వొడాఫోన్ సూపర్ డే ఆఫర్ ప్రకారం.. రూ. 19తో రీఛార్జ్ చేస్తే అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్ ఉచితంగా చేసుకోవచ్చు. దీంతో పాటు 100ఎంబీ 4జీ డేటాను కూడా అందిస్తోంది. ఇక సూపర్ వీక్ ఆఫర్ కింద రూ. 49తో రీఛార్జ్ చేసుకుంటే.. అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్‌తో పాటు 250ఎంబీ 4జీ డేటాను ఇస్తున్నట్లు వొడాఫోన్ తెలిపింది.
జియోలోనూ రూ. 19 ప్రారంభ ధరతో డేటా ఆఫర్లు ఉన్న విషయం తెలిసిందే. ఈ పోటీలో నిలదొక్కుకునేందుకే వొడాఫోన్ ఈ ఆఫర్‌ను తీసుకొచ్చింది. ప్రీపెయిడ్ యూజర్లకు ఇది లాభదాయకంగా ఉంటుందని సంస్థ చెబుతోంది.