Q2:భారీ నష్టాల్లో వొడాఫోన్ ఐడియా

539
- Advertisement -

సెప్టెంబర్ 2019 క్యూలో భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి టెలికాం దిగ్గజ కంపెనీలు.  సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం(ఏజీఆర్) బకాయులపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు టెలికాం కంపెనీల పాలిట గుదిబండగా మారింది. దీంతో సెప్టెంబర్ 2019 క్యూ2లో ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా దాదాపుగా రూ. 74,000 కోట్ల భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి.

ఇందులో వొడాఫోన్‌ ఐడియా నష్టాలే రూ.50,921 కోట్ల వరకు ఉన్నాయి. దీంతో వొడాఫోన్‌ ఐడియా భవిష్యత్‌ అగమ్య గోచరంగా మారింది. ప్రస్తుతం వొడాఫోన్‌ ఐడియా కంపెనీ ఈక్విటీలో ఆదిత్య బిర్లా గ్రూప్‌ నకు 26 శాతం, బ్రిటన్‌కు చెందిన వొడాఫోన్‌ గ్రూప్‌నకు 43 శాతం వాటా ఉంది. విలీన సమయంలోనూ రెండు కంపెనీలు రైట్స్‌ ఇష్యూ కింద రూ.25,000 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు సమకూర్చాయి. అప్పట్లో ఒక్కో షేరును రూ.12.5 చొప్పున కేటాయించారు. ఇప్పుడు అదే షేరు ధర రూ.2.95 స్థాయిలో ట్రేడవుతోంది. ప్రస్తుతం కంపెనీ అప్పుల భారం రూ.లక్ష కోట్లకు చేరువైంది.

భారతీ ఎయిర్‌టెల్‌ ఇంతకుముందెన్నడూ లేని విధంగా సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికానికి రూ.23,045 కోట్ల భారీ నష్టాన్ని నమోదు చేసింది. సుప్రీం కోర్టు తీర్పునకు అనుగుణంగా ఏజీఆర్‌ బకాయిల చెల్లింపు కోసం భారీగా కేటాయింపులు చేయాల్సి రావడం సెప్టెంబరు త్రైమాసికంలో వొడాఫోన్‌ ఐడియా, ఎయిర్‌టెల్‌ కంపెనీల ఆర్థిక పరిస్థితులను తీవ్రంగా దెబ్బతీసింది.

vodafone

- Advertisement -