రెడ్‌లో జాయిన్‌ అయిన రామ్‌..!

339
hero ram

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్‌తో తన కెరీర్‌లోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు హీరో రామ్‌. ఈ మూవీ తర్వాత ప్రస్తుతం కిషోర్ తిరుమల దర్శకత్వంలో మూవీ చేస్తున్నాడు రామ్‌. ఈ సినిమాకు రెడ్ అనే టైటిల్‌ని ఖరారు చేయగా సినిమా షూటింగ్‌లో జాయిన్ అయ్యాడు రామ్‌. కెరీర్‌లో తొలిసారి ద్విపాత్రాభినయం చేస్తున్నాడు రామ్‌.

కెరీర్‌లో తొలిసారి థ్రిల్లర్ జోనర్‌లో సినిమా చేస్తున్నాడు రామ్ . స్రవంతి కిషోర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మ‌ణిశ‌ర్మ‌ సంగీతం అందిస్తున్నారు. 2020 ఏప్రిల్ 9న సినిమా విడుదల చేయనున్నట్లు ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

కిషోర్ తిరుమల, రామ్ కాంబినేషన్‌లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో ఒకటే జిందగి, నేను శైలజ మూవీలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టాయి.