గ్రీన్ ఛాలెంజ్‌: మొక్కలు నాటిన బిగ్ బాస్ విన్నర్ సన్నీ

326
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా జర్నలిస్ట్ కాలనీలోని జిహెచ్ఎంసి పార్క్‌లో బిగ్ బాస్ 5 విన్నర్ విజే సన్నీ మిత్రులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వి.జె సన్నీ మాట్లాడుతూ.. ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లాంటి కార్యక్రమం అద్బుతమని సన్నీ కొనియాడారు.

బిగ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చి మొదటిసారి గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగస్వామ్యం అయ్యి మొక్కలు నాటే అవకాశం కలిగినందుకు ఎంపీ సంతోష్ కుమార్‌కి కృతజ్ఞతలు తెలుపుతున్నానని బిగ్ బాస్ 5 విన్నర్ విజే సన్నీ తెలిపాడు. అనంతరం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసురుతూ.. మరో ముగ్గురుని బిగ్ బాస్ ఫేం సిరి, షణ్ముక్, శ్రీరామ్ లు కూడా గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటాల్సిందిగా సన్నీ కోరాడు.

- Advertisement -