ఓవైసీ జంక్షన్ ఫ్లై ఓవర్‌ను పరిశీలించిన మేయర్..

28

హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు 8 వేల కోట్ల రూపాయలతో ఎస్‌ఆర్‌డీపీ కింద ఫ్లై ఓవర్లు, అండర్ పాసులు ఏర్పాటు చేస్తున్నామన్నారు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయ లక్ష్మీ. గురువారం ఓవైసీ జంక్షన్, షేక్‌పేట్ ఫ్లై ఓవర్లను జీహెచ్ఎంసీ మేయర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. ఇప్పటికే ఎస్‌ఆర్‌డీపీ కింద మొత్తం 22 ఫ్లై ఓవర్లు, అండర్ పాసులు అందుబాటులోకి తెచ్చామన్నారు. దీంతొ చాలా ట్రాఫిక్ కష్టాలు తీరాయి.. ఈ నెల చివరిలోపు షేక్‌పేట ఫ్లై ఓవర్, ఒవైసీ ఫ్లై ఓవర్ ప్రారంభిస్తామని మేయర్‌ తెలిపారు. మరో 25 ఫ్లై ఓవర్లు,అండర్ పాసులు పనులు జరుగుతున్నాయని.. అవి వచ్చే ఏడాది అందుబాటు లోకి తెస్తాయని మేయర్‌ పేర్కొన్నారు.