ఏపీలో గత ఎన్నికల ముందు వైఎస్ వివేకా హత్య ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ కేసు మిస్టరీగానే ఉంటూ ఎన్నో మలుపులు తిరుగుతోంది. అయితే ఈ నెల 30నాటికి కేసుకు సంబంధించి దొషులను బయటపెట్టాలని ఈ కేసు ను దర్యాప్తు చేస్తున్న తెలంగాణ సీబీఐకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన తరువాత కేసు దర్యాప్తులో వేగం పుంజుకుంది. ఈ కేసులో మొదటి నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ భాస్కర్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డిని ఎన్నో మార్లు విచారించి కీలక ఆధారాలు సేకరించింది సీబీఐ. ఎట్టకేలకు ఈ కేసు తుది అంకానికి చేరుకునే విధంగా ఇటీవల సీబీఐ వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసింది. ఆ తరువాత వైఎస్ అవినాష్ రెడ్డి కూడా అరెస్ట్ కావడం ఖాయం అని భావించరంతా. అయితే అనూహ్యంగా ఆయన ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు.
Also read: KTR:హైదరాబాద్ నగర జీవ వైవిద్య సూచీ విడుదల..
దీంతో సిబీఐ కూడా తమ వాదనలను హైకోర్టుకు వినిపించింది. విచారణ ఉన్న ప్రతిసారి అవినాష్ రెడ్డి హైకోర్టును ఆశ్రయిస్తున్నారని, అవినాష్ రెడ్డి ఈ కేసులో కీలక నిందితుడని ధర్మాసనం ముందు వాపోయింది సిబీఐ. ఈ కేసును ఈ నెల 30నాటికి పూర్తి చేయాలనే అధెశాలు తమకు ఉన్నాయని హైకోర్టు కు మరోసారి గుర్తు చేసింది సిబీఐ. ఇదిలా ఉండగా తాజాగా అవినాష్ రెడ్డి బెయిల్ పై తీర్పు వెలువరించిన ధర్మాసనం.. ఈ నెల 25 వరకు అరెస్ట్ చేయరాదని సిబీఐకి సూచించింది. అలాగే తుది తీర్పు కూడా 25నే చెబుతామని ధర్మాసనం చెప్పడంతో ఈ కేసు మరింత ఆసక్తికరంగా మారింది. కాగా ఈ నెల 25 వరకు తప్పక విచారణకు హాజరు కావాలని చెప్పుకొచ్చింది ధర్మాసనం. దాంతో ఈసారి విచారణలో అవినాష్ రెడ్డి తో పాటు, భాస్కర్ రెడ్డి మరియు ఉదయ్ కుమార్ రెడ్డి ముగ్గురిని ఒకేసారి విచరిస్తామని సిబీఐ తెలిపింది. దీంతో ఈనెల 25లోపు వివేకా హత్య కేసులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకొనున్నాయి. ముగ్గురిని సిబీఐ ఎలాంటి ప్రశ్నలు సంధించనుంది అనేది ఆసక్తికరంగా మారింది.
Also read: KTR:హైదరాబాద్‌కు మరో ఎంఎన్‌సీ కంపెనీ…