దర్శకుడు ఆదిత్య దర్ తెరకెక్కించిన ‘ధురంధర్ 2: ది రివెంజ్’ సినిమాకు అన్ని వర్గాల నుంచి అద్భుత స్పందన లభిస్తోంది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం సంచలన విజయాన్ని నమోదు చేస్తోంది. ఈ నేపథ్యంలో నటుడు వివేక్ ఒబెరాయ్ చిత్రబృందాన్ని ప్రశంసించారు. భారతీయ కథనాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లినందుకు ఆయన అభినందనలు తెలిపారు.
ఆదిత్య ధర్ మరియు ధురంధర్ టీమ్ భారత్ గొంతును ప్రపంచానికి వినిపించారు అని వివేక్ ఒబెరాయ్ అన్నారు. సినిమా స్కేల్, విజన్, ప్రభావం గొప్పగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇక ఈ సినిమాలో హీరోగా నటిస్తున్న రణ్‌వీర్ సింగ్‌కు సంబంధించిన ఓ వైరల్ ఫోటోపై వివాదం చెలరేగింది. టర్బన్ ధరించి స్మోకింగ్ చేస్తున్నట్లు చూపిన ఆ ఫోటోపై సిక్కు సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీనిపై స్పందించిన ఆదిత్య ధర్, ఆ చిత్రం పూర్తిగా ఫేక్ అని, AI ద్వారా రూపొందించబడిందని స్పష్టం చేశారు.
కొంతమంది అధికారిక పోస్టర్లను మార్ఫ్ చేసి, తప్పుదారి పట్టించేలా ఫేక్ చిత్రాలను ప్రచారం చేస్తున్నారు. రణవీర్ సింగ్ పాత్ర జస్కిరత్ స్మోకింగ్ చేస్తున్నట్లు చూపించిన చిత్రం పూర్తిగా అబద్ధం అని ఆయన తెలిపారు. సిక్కు సమాజానికి తాను అత్యంత గౌరవం ఇస్తానని కూడా ఆయన పేర్కొన్నారు.
‘ధురంధర్ 2: ది రివెంజ్’ కథ మొదటి భాగం ముగిసిన దగ్గర నుంచి కొనసాగుతుంది. రెహ్మాన్ డకైట్ మరణం తర్వాత ల్యారి ప్రాంతంలో జరిగే పరిణామాలు, భారత జాతీయ భద్రతకు సంబంధించిన గోప్య ఆపరేషన్లు, పాకిస్తాన్‌లోని శక్తివంతమైన శత్రువులతో పోరాటం చుట్టూ కథ తిరుగుతుంది. రణవీర్ సింగ్ పోషించిన హమ్‌జా/జస్కిరత్ పాత్ర మిషన్‌లో ముందుకు సాగుతూ ఎన్నో షాకింగ్ నిజాలను బయటపెడుతుంది.
Also Read:IPL: క్యాచ్‌లపై కొత్త కఠిన నిబంధనలు!

