హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) అధ్యక్షుడిగా మాజీ ఎంపీ,రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు జి. వివేక్ ఎన్నికయ్యారు. మొత్తం 206 ఓట్లకు గానూ విద్యుత్ జయసింహపై 68 ఓట్ల తేడాతో వివేక్ గెలుపొందారు. అన్ని స్థానాల్లోనూ వివేక్ ప్యానెల్ గెలుపొందింది. ఎనిమిది రౌండ్ లలో రౌండ్ రౌండ్ కు ముందంజలో సాగిన వివేకానంద్ ప్యానల్… గ్రాండ్ విక్టరీ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా వివేకానంద్ మాట్లాడుతూ… హైదరాబాద్ క్రికెట్ కు మంచి రోజులు తీసుకొస్తామని చెప్పారు. నైపుణ్యం కలిగిన క్రికెటర్లకు అవకాశాలు కల్పిస్తామన్నారు. మారుమూల ప్రాంతాల్లోని క్రీడాకారులను వెలుగులోకి తీసుకొస్తామన్నారు. అవినీతి, అవకతవకలపై దృష్టిసారించి… వెలికితీస్తామన్నారు. పారదర్శకతతో పనిచేస్తామన్నారు వివేక్.
ప్రెసిడెంట్ – జి. వివేకానంద్ – 136
వైస్ ప్రెసిడెంట్ – అనిల్ కుమార్ – 138
సెక్రటరీ – శేష్ నారాయణ – ఏకగ్రీవం
జాయింట్ సెక్రటరీ – అజ్మల్ అసద్ – 124
ట్రెజర్ – మహేందర్ – 148
ఎగ్జిటీవ్ మెంబర్ – హన్మంత్ రెడ్డి -100
ఇక జనవరి 17న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు ఎన్నికలు జరిగాయి. అధ్యక్ష పదవికి ప్రభుత్వ సలహాదారు జి.వివేకానంద్ తో పాటు.. మాజీ క్రికెటర్ జయసింహ పోటీ పడ్డారు. వైస్ ప్రెసిడెంట్, ట్రెజరర్, జాయింట్ సెక్రటరీ, ఈసీ మెంబర్ పదవులకు మరో 16 మంది పోటీ పడ్డారు. మొత్తం 218 ఓట్లకు 206 ఓట్లు పోల్ అయ్యాయి. 6 పదవులకు 18 మంది పోటీ పడ్డారు. హైకోర్టు ఆదేశాలతో.. ఎన్నికల ఫలితాలను అధికారులు ప్రకటించలేదు. ఇప్పుడు.. ఫలితాలు ఇవ్వాలని హై కోర్టు ఆదేశించడంతో.. ఫలితాల విడుదలకు రూట్ క్లియర్ అయ్యింది.