కాళోజీ జీవితం అందరికీ ఆదర్శం: ఎర్రబెల్లి

169
kaloji
- Advertisement -

ప్రజాకవి కాళోజీ జీవితం అందరికీ ఆదర్శమని తెలిపారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. కాళోజీ నారాయణరావు వర్దంతి సందర్భంగా నివాళి అర్పించిన ఎర్రబెల్లి…ప్ర‌జాక‌వి జ‌యంతిని రాష్ట్ర‌ ప్ర‌భుత్వం తెలంగాణ భాషా దినోత్స‌వంగా ప్ర‌క‌టించింద‌ని, ఆరోజున కాళోజీ స్మార‌క పుర‌స్కారాలు ఇస్తున్న‌ద‌ని చెప్పారు.

మాన‌వ‌తే కేంద్రంగా క‌విత్వాన్ని రాసి ప్ర‌పంచ వ్యాప్తం చేసిన మ‌హ‌నీడు ప్ర‌జా క‌వి కాళోజీ కొనియాడారు. నిరంత‌రం తెలంగాణ కోసం ప‌రిత‌పించిన మహానీయుడని… మాన‌వీయ విలువ‌ల‌ను చాటార‌ని తెలిపారు.

కాళోజీ జీవితాన్ని ఆద‌ర్శంగా తీసుకొని తెలంగాణ‌లో అనేక మంది క‌వుల‌య్యార‌ని ….కాళోజీ ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందినవారు కావడం మనందరి అదృష్టమన్నారు. కాళోజి జయంతి, వర్ధంతిలను ప్రభుత్వపరంగా నిర్వహిస్తున్నందుకు సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -