27న వివాహ భోజనంబు స్ట్రీమింగ్..

139
vivaha bhojanam

హాస్య నటుడు సత్య హీరోగా నటించిన చిత్రం ‘వివాహ భోజనంబు’. ఈ నెల 27న ఓటీటీలో సినిమా విడుదల కానుంది. సత్య సరసన అర్జావీ రాజ్‌ హీరోయిన్‌గా నటించగా సందీప్ కిషన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకొని విడుదలకి సిద్దంగా ఉన్న ‘వివాహ భోజనంబు’ ఈ నెల 27నుంచి సోనీ ఎలైవి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.

రామ్‌ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను ఆనంది ఆర్ట్స్ – సోల్జర్స్ ఫ్యాక్టరీ – వెంకటాద్రి టాకీస్ సమర్పణలో కేఎస్ శినీష్ – సందీప్ కిషన్ నిర్మించారు. సుదర్శన్‌, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, వైవా హర్ష, శివన్నారాయణ, టీఎన్‌ఆర్‌ తదితరులు ఇందులో కనిపించబోతున్నారు.

ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. తక్కువ ఖర్చుతో పెళ్లి చేసుకోవాలని చూసిన పిసినారి పెళ్లి కొడుక్కి లాక్ డౌన్ పిడుగుపాటులా మీద పడుతుంది. పెళ్లికి వచ్చిన బంధువులంతా ఇంట్లోనే 21 రోజుల పాటు ఉండిపోవాల్సి వస్తుంది. అసలే పిసినారి అయిన కథానాయకుడు వాళ్లకు పెట్టే ఖర్చులు తట్టుకోలేకపోతాడు. ఇలా ట్రైలర్‌లోనే నవ్వులు పూయిస్తే ఇక సినిమా చూస్తే ఫుల్ ప్లేట్ మీల్సే.