ఇది ఒక పల్లెటూరి ప్రేమకథ – హీరో సుధీర్‌ బాబు

62
Sudheer Babu

హీరోయిన్ ఆనంది, హీరో సుధీర్‌బాబు జంటగా నటించిన చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్‌’. ఈ చిత్రం శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో సుధీర్‌ బాబు మాట్లాడుతూ.. పాత్రలో ఒదిగిపోయి కనిపించేందుకు ముందస్తుగా సన్నద్ధమయ్యాను. గోదావరి యాస సహజంగా పలికేందుకు సంభాషణల విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాను. ఎలక్ట్రీషియన్లు పనిచేసే తీరును అవగాహన చేసుకున్నాను.

ఇది ఒక అందమైన ప్రేమకథ .. పల్లెటూళ్లలోని మనుషులు, వాళ్ల ఎమోషన్స్ ను చాలా సహజంగా ఆవిష్కరించిన సినిమా ఇది. ప్రతి లవర్ కూడా ఈ సినిమాలోని సూరిబాబు పాత్రలో తనని తాను చూసుకుంటాడు. ఆ పాత్ర అంతగా కనెక్ట్ అవుతుంది. ఈ సినిమా చేయడం మొదలుపెట్టిన దగ్గర నుంచి అంతా నా సిక్స్ ప్యాక్ గురించే మాట్లాడుతున్నారు. ఈ సినిమా విడుదలైన తరువాత కచ్చితంగా నా యాక్టింగ్ గురించి మాట్లాడుకుంటారని అనుకుంటున్నాను. ఈ సినిమా నా కెరియర్లో చెప్పుకోదగినదిగా నిలుస్తుందని భావిస్తున్నాను” అని చెప్పుకొచ్చాడు.