ఈ ట్రైలర్ చూస్తే పడిపడి నవ్వాల్సిందే..

227
Vivaha Bhojanambu Movie Trailer
- Advertisement -

‘వివాహ భోజనంబు’ సినిమాతో కమెడియన్ సత్య హీరోగా మారిపోయాడు. ఆయన కథానాయకుడిగా ఈ సినిమాను రామ్ అబ్బరాజు రూపొందించాడు. హీరో సందీప్ కిషన్ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించడం విశేషం. ఈ సినిమాలో సందీప్ కిషన్ కూడా అతిథి పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాను సోనీ లైవ్ ఓటీటీ ద్వారా త్వరలో విడుదల చేయనున్నారు. సోనీ లైవ్ ద్వారా రిలీజ్ అవుతున్న తొలి తెలుగు సినిమా ఇదే. ఈనేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

“వివాహ భోజనంబు” మూవీ ట్రైలర్ చూస్తే…తక్కువ ఖర్చుతో పెళ్లి చేసుకోవాలని చూసిన పిసినారి పెళ్లి కొడుక్కి లాక్ డౌన్ పిడుగుపాటులా మీద పడుతుంది. పెళ్లికి వచ్చిన బంధువులంతా ఇంట్లోనే 21 రోజుల పాటు ఉండిపోవాల్సి వస్తుంది. అసలే పిసినారి అయిన కథానాయకుడు వాళ్లకు పెట్టే ఖర్చులు తట్టుకోలేకపోతాడు. క్రికెట్ టీమ్ లా ఇంట్లో ఉండిపోయిన ఈ బంధువులను వదిలించుకోలేక అతను పడే పాట్లు నవ్వించాయి. ట్రైలర్ లోనే ఇన్ని నవ్వులు ఉంటే, సినిమాలో ఇక బోలెడన్ని నవ్వులు ఖాయమని తెలుస్తోంది.

- Advertisement -