సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు- మోత్కుపల్లి నర్సింహులు

288

బుధవారం వాసాల‌మ‌ర్రిలో ద‌ళిత బంధు ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తున్నాట్లు సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా దళిత బంధు ఈ నెల 5వ తేదీ నుండే అమలు చేయడం పట్ల హర్షం మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు వ్యక్తం చేశారు. నేను ప్రాతినిధ్యం వహించిన నియోజక వర్గం ఆలేరు నుండే దళితలకు దళిత బంధు పథకం అమలు చేస్తున్నట్లు చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు అని తెలిపారు.

దళిత జాతికి ఎంతో మేలు చేసే దళిత బంధు నా నియోజక వర్గం నుండి అమలు చేయడం సంతోషంగా ఉంది. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం దళితలకు నేరుగా వారి ఖాతాలో దళిత బంధు డబ్బులు 10 లక్షలు జమ చేయడం ఆనందదాయకం అన్నారు. వాసల మర్రి గ్రామం,ఆలేరు నియోజక వర్గం తోపాటు యాదాద్రి భువనగిరి జిల్లా చరిత్రలో నిలుస్తోంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు.