బాలీవుడ్ దిగ్గజ నటులు ఇర్ఫాన్ ఖాన్, రిషి కపూర్లను కొల్పోవడంతో బాలీవుడ్ ఉలిక్కిపడింది. వరుస షాక్‌లతో ఇండస్ట్రి కొలుకోకముందే మరో వార్త బీ టౌన్లో చక్కర్లు కొడుతోంది. నటుడు నసీరుద్దీన్ షా ఆరోగ్యం బాగాలేదని…ప్రస్తుతం ఆయన హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారనే న్యూస్ వైరల్‌గా మారింది.
దీంతో ఈ పుకార్లకు పుల్ స్టాప్ పెడుతూ స్పందించారు నసీరుద్దీన్ కొడుకు వివాన్ షా. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా పేర్కొన్న వివాన్..అవన్ని రూమర్స్..ఎవరూ నమ్మవద్దని పేర్కొన్నారు.
నసీర్ ఆరోగ్యం గురించి వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదు. దయచేసి ఎవరూ ఆ వార్తలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. ఇర్ఫాన్ భాయ్ మరియు చింటూజీ లేని లోటు పూడ్చలేనిది.. వారిని బాగా మిస్పవుతున్నారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నానని చెప్పారు వివాన్ షా.
All well everyone! Baba's just fine. All the rumours about his health are fake. He's keeping well 🙏Praying for Irfan Bhai and Chintu ji. Missing them a lot. Deepest condolences to their families. Our hearts go out to all of them. It's a devastating loss for all of us 😔🙏
— Vivaan Shah (@TheVivaanShah) April 30, 2020