బొల్లి మచ్చలకు నివారణ ఉందా?

47
- Advertisement -

బొల్లి మచ్చలతో ఇబ్బంది పడేవారు ఎదుర్కొనే మానసిక క్షోభ అంతా ఇంతా కాదు. నలుగురిలో కాన్ఫిడెంట్ గా తిరగలేరు. ఇతరులతో నవ్వుతూ మాట్లాడలేరు. తమను తాము అద్దంలో చూసుకుంటూ ఎంతో బాధపడుతుంటారు. ఈ బొల్లి సమస్య అనేది ఏ వయసు వారికైనా వచ్చే అవకాశం ఉంది. పిల్లలు పెద్దలు తేడా లేకుండా ఈ సమస్య కొందరిని వేధిస్తుంది. అయితే ఈ బొల్లి మచ్చలు ఏర్పడడానికి చాలానే కారణాలు ఉన్నాయి కొందరికి వంశపారపర్యంగా ఈ సమస్య వేధిస్తుంది. బొల్లి మచ్చలు ఏర్పడడానికి ప్రధాన కారణం శరీరంలో మెలోనిన్ కణాల స్థాయి తగ్గినప్పుడు చర్మం రంగును కోల్పోయి తెలుపు రంగులో మచ్చలు ఏర్పడతాయి. .

ఈ బొల్లి మచ్చలు మొఖంపై, కాళ్ళు చేతులపై, చర్మంపై, కొందరిలో వెంట్రుకలకు కూడా ఈ బొల్లి మచ్చల ప్రభావం ఉంటుంది. కాగా వీటిలో రెండు రకాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు సెగ్మెంటల్, నాన్ సెగ్మెంటల్ గా ఈ బొల్లి మచ్చలను చెబుతుంటారు వైద్యులు. ఈ మచ్చలు ఒకే భాగంలో ఏర్పడితే సెగ్మెంటల్ అని, చర్మంపై పలు చోట్ల ఏర్పడితే నాన్ సిగ్మెంటల్ అని చెబుతున్నారు వైద్యులు. కాగా ఈ బొల్లి మచ్చలు అంటూ వ్యాధి కానప్పటికి.. ఈ సమస్య దీర్ఘకాలికంగా మారి కుష్ఠు, క్యాన్సర్ వంటి రోగాలకు కూడా దారి తీస్తుందట.

Also Read:స్పామ్ కాల్స్ ను బ్లాక్ చేయండిలా!

మరి ఈ బొల్లి మచ్చలకు చికిత్స ఉందా ? అంటే పూర్తి స్థాయిలో చికిత్స అందుబాటులో లేదని, అయినప్పటికి ప్రస్తుతం ఉన్న అధునాతన వైద్య సదుపాయాల కారణంగా ముఖం, కాళ్ళు చేతులపై ఈ మచ్చలు పోగొట్టవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా ఈ బొల్లి మచ్చలను కొంతలో కొంతైనా నివారించవచ్చట. ముఖ్యంగా నీరు అధికంగా తాగాలి, అలాగే ప్రతిరోజూ మనం తినే ఆహారంలో ఆకు కూరలు, కూరగాయలు ఉండేలా చూసుకోవాలి, ముఖ్యంగా విటమిన్ బి, సి, అమినో యాసిడ్స్, ఫోలిక్ యాసిడ్స్ ఉన్న ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Also Read:సిలిండర్ ధరలపై ఎమ్మెల్సీ కవిత వ్యంగ్యాస్త్రం

- Advertisement -