Nagarjuna:మహేష్‌తో పోటీకి నాగ్ సై?

31
- Advertisement -

సీనియర్ హీరోలలో కింగ్ నాగార్జున గత కొన్నాళ్లుగా స్లో అయ్యారు. సోగ్గాడే చిన్ని నాయన మూవీ తరువాత ఆ రేంజ్ హిట్ పడకపోవడంతో ఆయన క్రేజ్ కూడా తగ్గిందనే విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం సీనియర్ హీరోలలో నందమూరి బాలకృష్ణ ఫుల్ ఫామ్ లో ఉన్నారు. ఆ తరువాత మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య మూవీతో హిట్ కొట్టినప్పటికి భోళా శంకర్ మూవీతో మళ్ళీ డిజాస్టర్ మూటగట్టుకున్నారు. ఇక కింగ్ నాగార్జున విషయానికొస్తే ఈ మద్య చేస్తున్న సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. రాజు గారి గది 2, ఆఫీసర్, వైల్డ్ గాడ్, ఘోస్ట్, వరుసగా పరాజయం మూటగట్టుకున్నాయి. .

ఇక మద్యలో బంగార్రాజు మూవీతో జస్ట్ యావరేజ్ హిట్ కొట్టినప్పటికి, అది నాగార్జున స్థాయి విజయం కాదు. దాంతో కింగ్ నాగ్ కచ్చితంగా బ్లాక్ బస్టర్ కొట్టాల్సిన పరిస్థితి. ప్రస్తుతం ఆయన విజయ్ బిన్నీ దర్శకత్వంలో నా సామిరంగ అనే మూవీ చేస్తున్నారు. ఆయన పుట్టిన రోజు సందర్బంగా చిత్రా యూనిట్ మూవీకి సంబంధించి టీజర్ ను వీడుదల చేసింది. టీజర్ లో నాగార్జున ఫుల్ మాస్ రోల్ లో కనిపిస్తున్నారు. గత కొన్నాళ్లుగా మాస్ రోల్స్ కు దూరంగా ఉన్న నాగ్ మళ్ళీ ఈ సినిమాతో పక్కా మాస్ రోల్ చేస్తునట్లు తెలుస్తోంది.

Also Read:Shiva Nirvana:’ఖుషి’ హార్ట్ టచింగ్ లవ్ స్టోరి

గడ్డంతో నాగ్ లుక్ కూడా కొత్తగా ఉండడంతో మూవీ టీజర్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయబోతునట్లు చిత్రాయూనిట్ అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ సంక్రాంతికి గట్టి పోటీ ఉండనుంది ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు ” గుంటూరు కారం ” మూవీతో సంక్రాంతి బరిలో ఉన్నారు. అలాగే మాస్ రాజ రవితేజ కూడా తన కొత్త సినిమా ” ఈగల్ ” ను సంక్రాంతికి రిలీజ్ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ముఖ్యంగా రేస్ లో మహేష్ బాబు మూవీ ఉండడంతో నాగ్ రిస్క్ చేస్తున్ననేది కొందరి అభిప్రాయం. మరి మహేష్ సినిమాను ఢీ కొట్టి.. కింగ్ నాగార్జున హిట్ కొడతాడేమో చూడాలి.

Also Read:స్పామ్ కాల్స్ ను బ్లాక్ చేయండిలా!

- Advertisement -