మనం ఆరోగ్యంగా ఉండడంలో విటమిన్ల పాత్ర చాలా కీలకం. ఎందుకంటే శరీరంలో అని అవయవాల పని తీరును విటమిన్లు క్రమబద్దీకరిస్తాయి. అందుకే విటమిన్స్ అనేవి చాలా ముఖ్యం. విటమిన్ ఏ, సి, డి, ఇ, కె మరియు బి కాంప్లెక్స్.. ఇలా విటమిన్స్ లో ప్రతిదీ కూడా ఒక నిర్ధిష్ట పని కల్గి ఉంటుంది. అందుకే వీటిలో ఏ ఒక్కటి లోపించిన మన శరీరంలో మార్పులు చోటు చేసుకుంటాయి. అయితే కొన్ని రాకల విటమిన్స్ లోపాన్ని ముందుగానే పసిగట్టవచ్చు. కానీ బి కాంప్లెక్స్ లోని విటమిన్ బి3 లోపాన్ని మాత్రం గుర్తించడం కాస్త కష్టమే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఇది లోపిస్తే సాధారణ అనారోగ్య సమస్యలే కనిపిస్తాయి. .
అందువల్ల ఆ సమస్యలు విటమిన్ బి3 లోపం వల్లే వచ్చీనవే అని గుర్తించలేరు. కొందరిలో అలసట, మతిమరుపు డిప్రెషన్ లాంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఈ లక్షణాలు ఉన్నవారిలో విటమిన్ బి3 లోపం కూడా కావొచ్చు కాబట్టి వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది. డెమొన్షియా, డెర్మటైటివ్ వంటి వ్యాధి లక్షణాలకు కూడా విటమిన్ బి3 లోపమే కారణం కావొచ్చు. అయితే విటమిన్ బి3 లోపం పెద్దగా ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం లేకపోయిన బి3 లోపాన్ని అధిగమించడం ముఖ్యమే అని న్యూట్రీషియన్స్ చెబుతున్నారు. విటమిన్ బి3 ఎక్కువగా దొరికే ఆహార పదార్థాలను తెలుసుకుందాం.!
Also Read:పిక్ టాక్ : అందాలతో అదరగొట్టింది
గుడ్లు
గుడ్లు మంచి ప్రోటీన్ ప్రదార్థం అని అందరికీ తెలిసిందే. గుడ్లలో ప్రోటీన్స్ తో పాటు విటమిన్స్, మినరల్స్ కూడా అధికంగా ఉంటాయి. ఇంకా గుడ్లలో నియాసిన్ అనే పదార్థం కూడా ఉంటుంది. కాబట్టి ప్రతిరోజూ గుడ్డు తినడం వల్ల విటమిన్ బి3 లోపాన్ని అధిగమించవచ్చట.
బీట్రూట్
బీట్రూట్ కూడా నియాసిన్ మెండుగా ఉండే ఆహారం. ఇందులో ఇంకా యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. తద్వారా విటమిన్స్ ను బీట్రూట్ సమతుల్యంగా మారుస్తుంది. కాబట్టి బీట్రూట్ ను ప్రతిరోజూ జ్యూస్ లేదా సలాడ్ లా చేసుకొని తాగితే విటమిన్ బి3 మెరుగుపడుతుందట.
ఇంకా క్యారెట్, నారింజ పండు, యాపిల్ వంటి వాటిలో కూడా విటమిన్ బి3 అధికంగా ఉంటుందట. అందువల్ల వీటన్నిటిని మన డైలీ ఆహార డైట్ లో చేర్చుకోవడం వల్ల విటమిన్ బి3ని అధిగమించ వచ్చని ఆహార నిపుణులు చెబుతున్నారు.
Also Read:షెడ్యూల్ ప్రకారమే ఎలక్షన్స్!