విశ్వనాథ్ గారి గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు

28
- Advertisement -

తెలుగు సినిమాల ప్రతిభను జాతీయ స్థాయికి తీసుకెళ్లిన లెజెండరీ డైరెక్టర్ కె.విశ్వనాథ్ గారి గురించి పలు ఇంట్రెస్టింగ్ అంశాలు తెలుసుకుందాం రండి.

షూటింగ్ ముగిసే వరకు ఖాకీ డ్రెసులే !
అవును, డైరెక్టర్ గా ఏ సినిమా తీసినా.. ఆ సినిమా స్టార్ట్ చేసి, ముగించే వరకు షూటింగ్ కి ఖాకీ డ్రెసులు వేసుకొని రావడం కె.విశ్వనాథ్ కు అలవాటు. తనను తాను కార్మికుడిలా భావిస్తానని, అందుకే ఖాకీ డ్రెస్ వేసుకుంటానని పలు సందర్భాల్లో విశ్వనాథ్ గారు చెప్పారు.

విశ్వనాథ్ గారు మొదట సౌండ్ రికార్డిస్ట్ అని మీకు తెలుసా ?

ఇది నిజం. విశ్వనాథ్ గారు సౌండ్ రికార్డిస్టుగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఆదుర్తి సుబ్బారావు దగ్గర కొన్ని సంవత్సరాల పాటు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. ప్రముఖ సీనియర్ హీరో ఏఎన్నార్ నటించిన ‘ఆత్మగౌరవం’ సినిమాతో ఆయన డైరెక్టర్ గా మారారు. ఈ సినిమాకు గానూ రాష్ట్ర ప్రభుత్వం విశ్వనాథ్ గారికి నంది అవార్డు కూడా ప్రకటించింది.

బాలీవుడ్‌లోనూ 10 చిత్రాలు తీసిన కె.విశ్వనాథ్

ఈ విషయం పెద్దగా ఎవ్వరికీ తెలియదు. కానీ, కె.విశ్వనాథ్. గారు బాలీవుడ్‌లోనూ 10 చిత్రాలకు దర్శకత్వం వహించారు. అక్కడ కూడా సంగీతానికి చాలా ప్రాముఖ్యతనిస్తూ సినిమాలను తీశారు. ఏది ఏమైనా సనాతన సంప్రదాయాన్ని తన ప్రతి సినిమాలోనూ ప్రతిభింబిస్తూ.. ఒక వ్యక్తి తన జీవనం విధానం ఇది అని తన సినిమాలలో చూపిస్తూ తెలుగు వెండితెరకే వన్నె తెచ్చారు కళాతపస్వి కే. విశ్వనాథ్ గారు.

కళాతపస్వి గొప్ప డైరెక్టర్ మాత్రమే కాదు, గొప్ప యాక్టర్ కూడా !

కళాతపస్వి విశ్వనాథ్ గొప్ప డైరెక్టర్ మాత్రమే కాదు ఓ మంచి యాక్టర్ కూడా. శుభసంకల్పం సినిమాతో తొలిసారి సిల్వర్ స్క్రీన్ పై కనిపించిన ఆయన.. వజ్రం, కలిసుందాం రా, నరసింహనాయుడు, సీమసింహం, నువ్వులేక నేనులేను, సంతోషం, లాహిరి లాహిరి లాహిరిలో వంటి పలు సినిమాల్లో మంచి పాత్రలతో పేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు.

ఇవి కూడా చదవండి…

ఓనం 2023..కింగ్‌ ఆఫ్ కోత

కళాతపస్వి…’ఎస్’ లెటర్ సినిమాలు

కళాతపస్వి కి ప్రముఖులు సంతాపం

- Advertisement -