సుప్రీంకోర్టు…కేంద్రంకు నోటీసులు

25
suprem
- Advertisement -

2002 నాటి గోద్రా అల్లర్ల నేపథ్యంలో బీబీసీ చేసిన డాక్యుమెంటరీని కేంద్రం బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. అయితే బీబీసీ డాక్యుమెంటరీని చూసే పౌరులను అరెస్టులు చేస్తోందని దీనిపై నిషేధం విధించడం భావ ప్రకటనా స్వేచ్ఛకు విరుద్దమేనని పేర్కొంటూ సీనియర్ జర్నలిస్ట్‌ రామ్, టీఎంసీ ఎంపీ మహువా మెయిత్రా, సామాజిక కార్యకర్త, న్యాయవాది ప్రశాంత్ భూషణ్, న్యాయవాది ఎంఎల్ శర్మ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలైంది. ఆ పిటిషన్ ఇవాళ విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు…కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. మూడు వారాల్లోగా స్పందన తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను వచ్చే ఏప్రిల్‌లో చేపట్టనున్నట్లు న్యాయస్థానం తెలపనుంది.

ఇవి కూడా చదవండి…

ముగిసిన బీఏసీ సమావేశాలు…

ప్రపంచంలోనే టాప్ 1..తిరుమల మ్యూజియం

5న మహారాష్ట్రలో బీఆర్ఎస్ సభ…

- Advertisement -