బన్ని- విశ్వక్‌సేన్‌ మల్టీస్టారర్‌!

96
allu

టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబినేషన్‌లో మల్టీస్టారర్ రాబోతుంది. విశ్వక్ సేన్- అల్లు అర్జున్ కాంబోలో మూవీ త్వరలో తెరకెక్కనుంది. కోలీవుడ్‌లో సూపర్ హిట్ సాధించిన “ఓ మై కడవులే” సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్నారు.

హిట్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న విశ్వక్ సేన్ మరియు మిథిలా పాల్కర్ లు ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించనున్నారు. పీవీపీ సినిమా మరియు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్‌ దేవుడి పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే రుద్రమదేవి సినిమాలో క్యామియో పాత్రలో మెప్పించిన అల్లు అర్జున్ ఈ సినిమాలో కూడా క్యానియో పాత్రలో కనిపించనున్నారని సమాచారం.