మ‌హా స‌ముద్రం లిరిక‌ల్ సాంగ్ రిలీజ్..

72
mahasamudram

శ‌ర్వానంద్‌, సిద్ధార్ధ్ హీరోలుగా అజ‌య్ భూప‌తి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం మహాసముద్రం. సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా సినిమా తెరకెక్కుతుండగా ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తయింది. సినిమా ప్రమోషన్‌లో భాగంగా సాంగ్‌ని రిలీజ్‌ చేశారు.

తాజాగా హే రంభ రంభ అనే సాంగ్ లిరిక‌ల్ వీడియో విడుద‌ల చేశారు. ఈ పాట‌ని భాస్క‌ర భ‌ట్ల రాయ‌గా, చైత‌న్ భ‌ర‌ద్వాజ్ ఆల‌పించారు. ఈ పాట మాస్ ప్రియుల‌కు మాంచి వినోదాన్ని అందిస్తుంది. ఇక ఈ సినిమాతో ఎనిమిదేళ్ల తర్వాత తెలుగు తెరపై అడుగుపెట్టబోతున్నాడు సిద్ధార్థ్. ఆగస్టు 19న చిత్రం విడుద‌ల కావ‌ల‌సి ఉండ‌గా, క‌రోనా వ‌ల‌న వాయిదా ప‌డింది. త్వ‌ర‌లోనే కొత్త రిలీజ్ డేట్ ప్ర‌క‌టించ‌నున్నారు.

Maha Samudram - Hey Rambha Rambha Lyrical | Sharwanand | Siddharth | Chaitan Bharadwaj, AjayBhupathi