బర్త్ డే..మొక్కలు నాటి..మీ ప్రేమను చాటండి: మహేశ్‌ బాబు

111
mahesh babu

ఆగస్టు 9న ప్రిన్స్ మహేశ్‌ బాబు పుట్టినరోజు వేడుకలు అంగరంగవైభవంగా జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ప్రతి ఏడాదిలా కాకుండా ఈ ఏడాది వినూత్నంగా బర్త్ డే సెలబ్రేషన్స్‌ని జరపుకునేలా ప్లాన్ చేశారు ప్రిన్స్ మహేశ్‌ బాబు.

పర్యావరణ పరిరక్షణ కోసం ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ప్రతి ఒక్కరూ తనకు బర్త్ డే గిఫ్ట్‌గా మొక్కలు నాటి మీ ప్రేమను చాటుకోవాలని పిలుపునిచ్చారు.

ఇప్పటికే గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా పలువురు సినీ,క్రీడా,రాజకీయాలకు చెందిన ప్రముఖులు తమవంతుగా తమ పుట్టినరోజున మొక్కలు నాటి ప్రజల్లో అవేర్ నెస్ తీసుకువస్తున్నారు. తాజాగా ప్రిన్స్ మహేశ్‌ బాబు కూడా మొక్కలు నాటాలని పిలుపునివ్వడంతో ఆగస్టు 9న వేలాది మంది అభిమానులు స్పందించే అవకాశం ఉంది.