‘విశ్వక్ సేన్’ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

21
- Advertisement -

విద్యాధర్ కాగిత దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా నటించిన మూవీ ‘గామి’. ఈ మూవీ రేపు రిలీజ్ కాబోతుంది. ఐతే, ఈ సినిమా ప్రమోషన్స్ లో విశ్వక్ సేన్ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తాను హీరోగా ప్రయత్నిస్తున్న సమయంలో తనను కొంతమంది అవమానించారని హీరో విశ్వక్సేన్ తాజా ఇంటర్వ్యూలో చెప్పారు. ఒకసారి తన సినిమా ఫంక్షన్ కి ఓ ప్రముఖ హీరోను పిలిచానని ఆయన రాలేదన్నారు. ఈ నేపథ్యంలో తాను హీరో వెంకటేష్ ను కలిశానని, వెంటనే సినిమా ఫంక్షన్ కి వచ్చేశారని చెప్పుకొచ్చారు.

అలాగే, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ కూడా తనను బాగా ఎంకరేజ్ చేశారని పేర్కొన్నారు. ‘గామి’ చిత్రం మంచి ఫలితాన్ని ఇస్తుందని విశ్వక్ సేన్ ఆకాంక్షించారు. అన్నట్టు, ఈ మూవీపై దర్శకధీరుడు రాజమౌళి ఆసక్తికర పోస్ట్ చేశారు. ‘‘కఠోరమైన కృషి ఉంటే అసాధ్యమైన కలలు సాకారమవుతాయి. గామి గురించి దర్శకుడు, నిర్మాత ఎంత కష్టపడ్డారో నాతో చెప్పినప్పుడు ఈ మాట గుర్తొచ్చింది. ఇందులోని విజువల్స్ చూస్తే నాలుగేళ్ల నుంచి వాళ్లు ఎంత కష్టపడ్డారో అర్థమైంది’ అంటూ చిత్ర బృందానికి శుభాకాంక్షలు’’ తెలిపారు.

దీంతో, ‘గామి’ సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. కాగా ‘గామి’లో ముగ్గురి పాత్రలు కీలకమని, వారి చుట్టే సినిమా నడుస్తుందని హీరో విశ్వక్ సేన్ తెలిపారు. సీటీ 333, ఉమ, శంకర్ పాత్రలతో ప్రేక్షకుల కనెక్ట్ అవుతారని చెప్పారు. హైదరాబాద్‌ లో జరిగిన మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఆయన మాట్లాడారు. తన జీవితంలో కలిసిన నిజాయితీ గల గొప్ప వ్యక్తి దర్శకుడు విద్యాధర్ అని కొనియాడారు.

Also Read:ఇవి పాటిస్తే.. బాడీ ఫిట్‌నెస్ సూపర్!

- Advertisement -