విశ్వక్ సేన్ సాహాసం..ఫ్లాప్ సినిమా రీమేక్!

9
- Advertisement -

వైవిధ్యమైన సినిమాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో విశ్వక్ సేన్. వైవిధ్యమైన సినిమాలు చేస్తూ నిర్మాతల పాలిట కల్పవృక్షంలా మారారు విశ్వక్. త్వరలో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో రాబోతుండగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

ఎన్టీఆర్- విశ్వక్ మధ్య మంచి రాపో ఉండగా ఒకవేళ ఎన్టీఆర్ సినిమా రీమేక్ చేస్తే ఏ సినిమా చేస్తావు అని అడగ్గా విశ్వక్ సమాధానమిస్తూ.. నా అల్లుడు అని చెప్పాడు. దీంతో యాంకర్ షాక్ కాగా కొంచెం మార్పులు చేసి తీస్తే ఈ సినిమా బాగుంటుందని చెప్పారు.

వాస్తవానికి ఎన్టీఆర్ కెరీర్‌లో బిగ్గెస్ట్ డిజాస్టర్ సినిమాల్లో ఒకటి నా అల్లుడు. ఈ సినిమాకు రీమేక్ చేస్తానని విశ్వక్ సేన్ చెప్పడం ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ని ఆశ్చర్యానికి గురి చేసింది.

Also Read:లోకేష్‌ని టీడీపీ అధ్యక్షుడిని చేయాలి!

- Advertisement -