రోహిత్ నందా, ఆనంది జంటగా శ్రీకాంత్ రంగనాథన్, శ్రీనాథ్ రంగనాథన్ దర్శకద్వయం తెరకెక్కించిన చిత్రం ‘విధి’. రంజిత్ ఎస్ నిర్మించిన ఈ మూవీకి శ్రీ చరణ్ పాకాల సంగీతాన్ని అందించారు. నవంబర్ 3న రాబోతోన్న విధి మూవీ టీజర్‌ను సోమవారం విడుదల చేశారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన టీజర్ లాంచ్ ఈవెంట్‌లో మాస్ కా దాస్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ ఈవెంట్‌లో
విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. ‘ఈ మూవీ నిర్మాత రంజిత్ నాకు స్నేహితుడు. ఇలా నాకు కూడా ఓ బ్రదర్ ఉంటే బాగుండనిపిస్తుంది. ప్రొడక్షన్‌లోనే సాయం చేసేందుకు, ఇలా సపోర్ట్‌గా నిలిచేందుకు ఓ బ్రదర్ ఉంటే బాగుండని ఈ దర్శకుల్ని చూస్తుంటే అనిపిస్తుంది. ఆనంది ఏ సినిమా పడితే ఆ సినిమా చేయదు. ఎంతో ఇంపార్టెన్స్ ఉంటేనే ఓకే చేస్తుంది. నవంబర్ 3న సినిమా రిలీజ్ కాబోతోంది. సినిమా పెద్ద హిట్ అవ్వాలి. నిర్మాతకు మంచి లాభాలు రావాలి. అందరూ థియేటర్లో మూవీని చూడండి.’ అని అన్నారు..
నిర్మాత రంజిత్ మాట్లాడుతూ.. ‘మా దర్శకులు, హీరో అద్భుతం చేశారు. వారి మొదటి సినిమాలా ఉండదు. సినిమాలోని కథ, కథనాన్ని ఎవ్వరూ ఊహించరు. అద్భుతంగా ఉంటుంది. కథ చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. అందరూ మా సినిమాను చూడండి’ అని అన్నారు.
డైరెక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘మనం మాట్లాడే కంటే.. మనం తీసే కంటెంట్ మాట్లాడాలి. మంచి కంటెంట్‌తో రాబోతోన్నాం. నవంబర్ 3న ఈ చిత్రం రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.
కెమెరామెన్, డైరెక్టర్ శ్రీనాథ్ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం తెలుగు సినిమా మంచి దశలో ఉంది. అన్ని రకాల చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. మా సినిమాను కూడా ఆడియెన్స్ ఆదరిస్తారని అనుకుంటున్నాం. మా ఈవెంట్‌కు వచ్చి సపోర్ట్ చేస్తున్న విశ్వక్ సేన్ గారికి థాంక్స్. ఈ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ఉంటుంది. వంద శాతం కష్టపడి పని చేశామ’ని అన్నారు.
రోహిత్ నందా మాట్లాడుతూ.. ‘విశ్వక్ అన్న మా ఈవెంట్‌కు వచ్చి సపోర్ట్ చేస్తుండటం ఆనందంగా ఉంది. ఇది మాకు ఎంతో గొప్ప విషయం. మా దర్శకుడు శ్రీకాంత్, శ్రీనాథ్‌లు అద్భుతంగా తీశారు. కొత్త వాళ్లు తీసినట్టుగా అనిపించదు. సినిమాలో చాలా సర్ ప్రైజ్‌లు ఉన్నాయి. అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. నవంబర్ 3న సినిమా రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.
ఆనంది మాట్లాడుతూ.. ‘ఇలా మా టీజర్ ప్రేక్షకుల మధ్య జరగడం ఆనందంగా ఉంది. మా ఈవెంట్‌కు వచ్చిన విశ్వక్ సేన్ గారికి థాంక్స్. కొత్త టీం కలిసి చేసిన చిత్రమిది. మా దర్శకులిద్దరూ ఇది వరకు సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడూ పని చేయలేదు. అనుభవం లేదు. కానీ అద్భుతంగా తీశారు. కొత్తగా తీశారు. అందరికీ ఈ సినిమా నచ్చుతుంది. రోహిత్ అద్భుతంగా నటించాడు. చాలా రోజుల తరువాత నేను నటించిన తెలుగు సినిమా రిలీజ్ అవుతుంది. అందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను’అని అన్నారు.
Also Read:గోడకుర్చీ వేస్తే.. ఉపయోగాలు తెలుసా?