సంక్రాంతికి సందడి చేయనున్న ‘సామాన్యుడు’..

21

సరికొత్త కథలను తెరపైకి తీసుకొస్తూ ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేస్తుంటారు కోలీవుడ్ స్టార్ విశాల్. ఈ క్రమంలోనే ఆయన కొత్త సినిమా ‘సామాన్యుడు’ ఓ యూనిక్ కంటెంట్ తో తెరకెక్కింది. డెబ్యూ డైరెక్టర్ తు ప శరవణన్ రూపొందించిన ఈ యాక్షన్ డ్రామా జనవరి 14న సంక్రాంతి పండక్కి థియేటర్ లలో విడుదలకు సిద్ధమవుతోంది. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ మీద ఈ సినిమాను విశాల్ నిర్మించారు.

తాజాగా ‘సామాన్యుడు’ మూవీ నుంచి రిలీజ్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ చూస్తే..ఫుల్ యాక్షన్ మోడ్‌లో ‘సామాన్యుడు’ సినిమా ఉండబోతోన్నట్టు కనిపిస్తోంది. అలాగే ఇటీవల విడుదల చేసిన టీజర్ కు సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. విశాల్ సరసన డింపుల్ హయతి నాయికగా నటించారు. కెవిన్ రాజ్ సినిమాటోగ్రఫీ, యువన్ శంకర్ రాజా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ‘సామాన్యుడు’ సినిమాను టెక్నికల్ గా స్ట్రాంగ్ గా మార్చేశాయి. యోగిబాబు, బాబురాజ్ జాకబ్, పా తులసి, రవీనా రవి ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న విడుదల కానుంది.

నటీనటులు : విశాల్, డింపుల్ హయతి, యోగిబాబు, బాబురాజ్ జాకబ్, పా తులసి, రవీనా రవి

సాంకేతిక బృందం
డైరెక్టర్ : తు ప శరవణన్
నిర్మాత : విశాల్
సంగీతం : యువన్ శంకర్ రాజా
డీఓపీ : కెవిన్ రాజా
ఎడిటర్ : ఎన్ బి శ్రీకాంత్
ఆర్ట్ : ఎస్ఎస్ మూర్తి
కాస్ట్యూమ్ డిజైనర్ : వాసుకి భాస్కర్
పీఆర్వో : వంశీ శేఖర్
పబ్లిసిటీ డిజైన్ : విక్రమ్ డిజైన్స్