సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే..

119
- Advertisement -

ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రజలకు సంక్షేమానికి ఎన్నో గొప్ప పథకాలను తీసుకువస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందన్నారు. 24 గంటలపాటు కరెంటు సరఫరా, రైతు బంధు ,రైతు బీమా ఆసరా పింఛన్, కల్యాణ లక్ష్మీ వంటి పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. రైతుబంధు పథకం ద్వారా ఇప్పటివరకు నేరుగా రైతుల అకౌంట్లలలో 50 వేల కోట్లు వేసిన చరిత్ర టీఆర్ఎస్ ప్రభుత్వానిదని ఎమ్మెల్యే అన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌ రెడ్డి.

వ్యవసాయ శాఖ అధికారి మాట్లాడుతూ.. డిసెంబర్ 10, 2021 పట్టాలు పొందిన ప్రతి రైతు ఈ యాసంగికి అర్హులే అని, ఇది వరకు రైతుబంధు వస్తున్న రైతులు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. రైతుబంధు సొమ్ము రైతుల ఖాతాల్లో డిసెంబర్ 28 2021 నుండి రైతుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని, మెదక్ మండలంలో మొత్తం రైతుబంధుకి రైతులు 13,627 మంది ఉన్నారని, రైతు భీమా పథకానికి నమోదు చేసుకున్న రైతులు 8,165 మంది అని తెలిపారు. 2020 ఆగస్టు నుండి ఇప్పటివరకు రైతు బీమా ఉండి పోయిన రైతుల సంఖ్య 29 అని తెలిపారు.

ఎక్సైజ్ శాఖ అధికారి మాట్లాడుతూ.. మండలంలో 16-tcs కల్లు దుకాణాలు, 13 TFT కల్లు దుకాణాలు, మద్యం దుకాణాలు 7, బారు దుకాణాలు 2 ఉన్నాయని గత సంవత్సరం జనవరి నెల నుంచి కల్లు దుకాణాలు తనిఖీ చేసి tcs దుకాణంలో నుండి 27, tft దుకాణంలో నుండి 22 కళ్ళు శాంపుల్ తీసుకొని ప్రభుత్వ ప్రయోగశాలకు పంపామని అక్రమంగా కళ్ళు దుకాణం నడుపుతున్న ఒక వ్యక్తిపై కేసు నమోదు చేశమని తెలిపారు. మెదక్ మండలంలోని పలు గ్రామాలలో హరితహారంలో భాగంగా గా 4,600 ఈత మొక్కలు నాటడం జరిగింది అని, మండలంలో అక్రమంగా గంజాయి అమ్ముతున్న, రవాణా చేస్తున్న వారిపై నాలుగు కేసులు చేసి ఐదుగురిని జైలుకు పంపించడం జరిగిందని తెలిపారు.

- Advertisement -