విజయ్‌కు విశాల్ వినూత్న కానుక

1
- Advertisement -

సాధారణంగా ఒక సినీ నటుడు ముఖ్యమంత్రిని కలిసినప్పుడో లేదా ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకోవాలనుకున్నప్పుడో ఖరీదైన పూల బొకేలు, శాలువాలు ఇవ్వడం మనం చూస్తుంటాం. కానీ తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు విషాల్ మాత్రం వీటన్నింటికంటే ‘విద్యాదానం’ మిన్న అని నిరూపిస్తూ ఒక అద్భుతమైన నిర్ణయాన్ని తీసుకున్నారు.

తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన (తమిళగ వెట్రి కళగం పార్టీ అధినేత) దళపతి విజయ్ గౌరవార్థం… విషాల్ ఒక వినూత్న కానుకను ప్రకటించారు. ఆర్థికంగా వెనుకబడిన ముగ్గురు విద్యార్థినుల ఉన్నత చదువుల బాధ్యతను తానే స్వయంగా తీసుకోబోతున్నట్లు వెల్లడించారు. ఈ ముగ్గురు ఆడపిల్లల కాలేజీ ఫీజులు, ఇతర విద్యా ఖర్చులను స్పాన్సర్ చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.

ఈ సందర్భంగా విషాల్ సోషల్ మీడియా వేదికగా ఒక హృదయపూర్వక సందేశాన్ని పంచుకున్నారు.ఒక పూల బొకే కొద్ది రోజులు మాత్రమే అందంగా ఉంటుంది… ఆ తర్వాత వాడిపోతుంది. కానీ ఒక చిన్నారికి అందించే విద్య, ఆమె జీవితాంతం వెలుగులను నింపుతుంది. ముఖ్యమంత్రి విజయ్ గారిపై ఉన్న గౌరవంతో ఈ నిర్ణయం తీసుకున్నాను అని చెప్పారు.

- Advertisement -