గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గోన్న ఏపీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మీ

488
Green cha
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమానికి అద్భుతమైన స్పందన వస్తోంది. గ్రీన్ ఛాలెంజ్ మరియు రోజావనం సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో విశాఖఏజన్సీ శాసనసభ సభ్యురాలు కొట్టగుల్లి భాగ్యలక్ష్మి మొక్కలు నాటారు. నగరి శాసనసభ్యురాలు రోజా ఆదేశాల మేరకు స్థానిక పాడేరు కస్తూరిబాయ్ విద్యాలయంలో ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, మొక్కలు నాటారు

ఈ సందర్భంగా ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. స్వచ్ఛమైన ప్రకృతి కి అన్ని కార్యాలయాల్లో పాఠశాలలో మొక్కలు నాటి పచ్చదనం గా తీర్చి దిద్ది అచ్చమైన స్వచ్ఛమైన ఆక్సిజన్ని తీసుకోవాలని సూచించారు. దీనికి పునాదులు విద్యార్థులేనని తమ తమ ప్రాంతాలలో గ్రామాలలో పచ్చదనం మొక్కలు నాటి ప్రాంతాలను గ్రామాల్లోని పచ్చదనాన్ని పెంచి స్వచ్ఛమైన ప్రకృతిలో అచ్చమైన ఆక్సిజన్ ని పిలిచి ఆరోగ్యాన్ని ప్రకృతిని సంరక్షించుకోవాలి అని సూచించారు. స్వచ్ఛంద సంస్థలు సహకారంతో మొక్కలను సేకరించి అచ్చమైన ప్రకృతి లోభాగంగా మొక్కలు నాటి స్వచ్ఛమైన గాలి పీల్చాలని కోరారు. దేశంలో ఢిల్లీ లాంటి ప్రముఖ నగరాలలో కృత్రిమ ఆక్సిజన్ని కొనుక్కొని పీల్చే పరిస్థితి నెలకొంటుందని ఆర్ కే రోజా నగరి ఎమ్మెల్యే ఆదేశాల మేరకు గ్రీన్ చాలెంజ్ ,రోజా వనం లో భాగంగా ఈరోజు లగిసపల్లి, కస్తూర్బాయి పాఠశాలలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టామని,అన్నారు. ప్రత్యేక చొరవతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళుతున్న సిని నటి , నగరి నియోజకవర్గం ఎమ్మెల్యే రోజా గారిని ప్రత్యేకంగా అభినందించారు.

- Advertisement -