పట్టణ ప్రగతిలో ప్రజలంతా భాగస్వాములు కావాలి

254
koppulainpp

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రజలు స్వచ్చందంగా పాల్గోనాలని పిలుపునిచ్చారు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్. జగిత్యాల జిల్లా కోరుట్ల, మెట్‌పల్లి మున్సిపాలిటీలో ఇవాళ చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో మంత్రి కొప్పుల పాల్గోన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే విద్యాసాగర్‌ రావు, జిల్లా కలెక్టర్‌ రవి, జేసీ రాజేశం, మున్సిపల్‌ చైర్మన్‌లు, తదితరులు పాల్గొన్నారు.

ఈసందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ… పట్టణ ప్రగతి నిరంతర ప్రక్రియన్నారు. ప్రజలంతా భాగస్వాములు కావాలన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, కమిటీల సభ్యులు వార్డుల్లోని పారిశుద్ధ్యం, వీధి లైట్లు, డ్రైనేజీలు, త్రాగునీటి సరఫరా తదితర అంశాలను పరిశీలించి అభివృద్ధి ప్రణాళికలు తయారు చేయనున్నట్లు తెలిపారు. ప్రజా ప్రతినిధులు, అధికారులకు ప్రజలు సహకరించాలని కోరారు.