నిషేధిత చైనా యాప్‌ల జాబితా ఇదే…

214
china apps ban

కొద్దికాలంగా భారత్ – చైనా మధ్య సరిహద్దుల ఉద్రిక్త పరిస్ధితులు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సరిహద్దుల్లో భారీగా సైన్యాన్ని మోహరించగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ సారి డిజిటల్ స్ట్రైక్ చేస్తూ 59 చైనా యాప్‌లపై నిషేధం విధించారు.

సమాచార సాంకేతికత నిబంధనలు 2009, సమాచార సాంకేతికత చట్టంలోని సెక్షన్‌ 69ఏ కింద ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. దేశ రక్షణ, భద్రత, సార్వభౌమాధికారం, సమగ్రత దృష్ట్యా ఈ యాప్‌లపై నిషేధం విధించినట్టు వివరించింది. ఆండ్రాయిడ్‌, ఐవోఎస్‌ ప్లాట్‌ఫాంలలోని కొన్ని యాప్స్‌ వినియోగదారుల సమాచారాన్ని దొంగిలిస్తున్నాయి. విదేశాల నుంచి నడుస్తున్న కొన్ని సర్వర్లకు అనధికారికంగా ఆ సమాచారాన్ని రహస్యంగా చేరవేస్తున్నాయి అని కేంద్రం వెల్లడించింది.

నిషేధించి చైనా యాప్‌ల జాబితా ఇదే..

టిక్‌టాక్‌, షేర్‌చాట్‌, క్వాయి, యూసీ బ్రౌజర్‌, బైయిదూ మ్యాప్‌, షెయిన్‌, క్లాష్‌ ఆఫ్‌ కింగ్స్‌, డీయూ బ్యాటరీ సేవర్‌, హలో, లైకీ, యూక్యామ్‌ మేకప్‌, మీ కమ్యూనిటీ, సీఎమ్‌ బ్రౌజర్స్‌, వైరస్‌ క్లీనర్‌, ఏపీయూఎస్‌ బ్రౌజర్‌, రామ్‌వీ, క్లబ్‌ ఫ్యాక్టరీ, న్యూస్‌డాగ్‌, బ్యూటీప్లస్‌, వీచాట్‌, యూసీ న్యూస్‌, క్యూక్యూ మెయిల్‌, వీబో, క్యూక్యూ మ్యూజిక్‌, క్యూక్యూ న్యూస్‌ ఫీడ్‌, బిగో లైవ్‌, సెల్ఫీసిటీ, మెయిల్‌ మాస్టర్‌, ప్యారెలాల్‌ స్పేస్‌, మీ వీడియో కాల్‌, వీ సింక్‌, ఈఎస్‌ ఫైల్‌ ఎక్స్‌ప్లోరర్‌, వైవా వీడియో, మెయితూ, విగో వీడియో, న్యూ వీడియో స్టేటస్‌ డీయూ రికార్డర్‌, వాల్ట్‌ హైడ్‌, క్యాష్‌ క్లీనర్‌, డీయూ క్లీనర్‌, డీయూ బ్రౌజర్‌, హగో ప్లే, క్యామ్‌ స్క్యానర్‌, క్లీన్‌ మాస్టర్‌ (ఛీతా మొబైల్‌), వండర్‌ కెమెరా, ఫొటో వండర్‌, క్యూక్యూ ప్లేయర్‌, వీ మీట్‌, స్వీట్‌ సెల్ఫీ, బైయిదూ ట్రాన్స్‌లేట్‌, వీమేట్‌, క్యూక్యూ ఇంటర్నేషనల్‌, క్యూక్యూ సెక్యూరిటీ సెంటర్‌, క్యూక్యూ లాంఛర్‌, యూ వీడియో, వీ ఫ్లై స్టేటస్‌ వీడియో, మొబైల్‌ లెజెండ్స్‌, డీయూ ప్రైవసీ.