కరోనా బాధితులకు విరుష్క జోడి 2 కోట్ల విరాళం..

199
anushka
- Advertisement -

దేశంలో కరోనా సెకండ్ వేవ్ రోజురోజుకు తీవ్రమవుతుండగా ఆక్సిజన్ అందక ప్రజలు వేల సంఖ్యలో మృత్యువాతపడుతున్నారు. ఈ నేపథ్యంలో పలువురు సెలబ్రెటీలు బాధితులకు అండగా నిలబడేందుకు ముందుకొస్తుండగా తాజాగా విరాట్‌, అనుష్క శ‌ర్మ దంప‌తులు ముందుకొచ్చారు. క‌రోనా బాధితుల స‌హాయార్థం రూ. 2 కోట్లు విరాళం ఇస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. మ‌న కోసం వైద్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ వ‌ర్క‌ర్స్ ఎంత‌గానో క‌ష్ట‌ప‌డుతున్నారు. వారికి ఇప్పుడు మ‌నం అండ‌గా ఉండాలి. అందుకే అనుష్క శ‌ర్మ , నేను .. కెట్టోతో క‌లిసి ఫండ్ రైజింగ్ క్యాంపెయిన్‌ను మొద‌లు పెడుతున్నాం. మీరిచ్చే ప్ర‌తి రూపాయి ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుందని వెల్లడించారు.

- Advertisement -