విప్ ధిక్కరిస్తే క్రమశిక్షణ చర్యలు: ఎర్రబెల్లి

146
dayakarrao

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందిన కార్పోరేటర్లతో జిల్లాకు చెందినమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, పరిశీలకులుగా వచ్చిన మంత్రులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు, ఎమ్పీలు హన్మకొండలోని హరిత కాకతీయ హోటల్ కాన్ఫరెన్స్ హాల్ లో సమావేశం అయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఎర్రబెల్లి…ఈ ఎన్నికల్లో పోటీచేసి గెలిచిన వారిలో ఎనిమిది మందికి కరోనా పాజిటివ్ రావడం బాధాకరం అన్నారు. గెలుపోందివారు వీడియో కాల్ ద్వారా ప్రమాణ స్వీకారంతోపాటు, మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలో పాల్గొనే అవకాశం ఉందన్నారు. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకే జరుగుతుందని….కొన్ని సమీకరణాలు దృష్ట్యా పార్టీ నిర్ణయం ఉంటుందన్నారు. పార్టీ నిర్ణయాన్ని కాదని విప్ దిక్కరిస్తే క్రమ శిక్షణా చర్యలు ఉంటాయన్నారు.

మున్సిపల్ కౌన్సిలర్ గా నా రాజకీయ జీవితం ప్రారంభమైంది….పార్టీని నమ్ముకొని, పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటే అవకాశాలు వస్తాయన్నారు మంత్గంగుల కమలాకర్. పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండాలి….సీల్డ్ కవర్ లో పార్టీ అధిష్టానం మేయర్, డిప్యూటీ మేయర్ గా ఎవరి పేరప్రతిపాదించనా స్వాగతించాలన్నారు.