టీ20 వరల్డ్ కప్‌కు ఆ ముగ్గురు డౌటే..?

63
- Advertisement -

వన్డే వరల్డ్ కప్ తృటిలో చేజార్చుకున్న టీమిండియా వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్ కప్ కోసం ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలు పెట్టింది. ఈసారి ఎలాగైనా పొట్టి కప్పు సొంతం చేసుకోవాలని గట్టి పట్టుదలగా ఉంది. 2007 ధోని కెప్టెన్సీలో పొట్టి వరల్డ్ కప్ గెలిచిన టీమిండియా ఇంతవరకు కప్పు సాధించలేదు. దాంతో ఈసారి ఎలాగైనా టీ20 వరల్డ్ కప్ సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. అయితే గత 15 ఏళ్లుగా ఇండియన్ క్రికెట్ ను శాసిస్తూ ప్రపంచంలో తమదైన ముద్రా వేసిన రన్ మిషన్ విరాట్ కోహ్లీ, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ వచ్చే టీ20 వరల్డ్ కప్ కు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయని కొందరు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఈ ఇద్దరిని గత కొన్నాళ్లుగా టీ20 లకు దూరం పెడుతుంది బీసీసీఐ. .

వీరి స్థానంలో యువ ఆటగాళ్లకు ఛాన్స్ లు ఇస్తూ టీ20 లను ముందుకు నడిపిస్తోంది. 2022లో జరిగిన టీ20 వరల్డ్ కప్ తర్వాత దాదాపుగా అన్నీ టీ20 మ్యాచ్ లకు వీరిద్దరు దూరంగా ఉంటూ వస్తున్నారు. రోహిత్ అధికారిక కెప్టెన్ అయినప్పటికి హర్ధిక్ పాండ్యా టీ20 లకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో వచ్చే టీ20 వరల్డ్ కప్ కు వీరిద్దరు దూరమైన ఆశ్చర్యం లేదనేది కొందరి అభిప్రాయం. అటు మరో సీనియర్ ఆటగాడు ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా టీ20లకు దూరమయ్యే అవకాశం ఉంది. అశ్విన్ వైట్ బాల్ క్రికెట్ లో పెద్దగా రాణించలేదు. 2022 టీ20 వరల్డ్ కప్, 2023 వన్డే వరల్డ్ కప్ లకు జట్టులో చోటు దక్కినప్పటికి ఆడే అవకాశం లభించలేదు. ప్రస్తుతం 37 సంవత్సరాలు ఉన్న అశ్విన్ వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్ కు అందుబాటులో ఉండడం కష్టతరమే అని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తం మీద ఈ ముగ్గురు దిగ్గజ ఆటగాళ్లు టీ20 వరల్డ్ కప్ కు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని టాక్.

Also Read:రైతుబంధుకు గ్రీన్ సిగ్నల్

- Advertisement -