విరాట్ కోహ్లీ..టీమిండియా కెప్టెన్‌గానే కాదు తన బ్యాటింగ్ శైలీతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. టార్గెట్ ఎంతైనా,బౌలర్ ఎవరైనా విరాట్ ముందు తలవంచాల్సిందే. పరుగుల యంత్రంగా రికార్డులను తిరగరాస్తున్న కోహ్లీ తాజాగా బాల్‌తోనూ మ్యాజిక్ చేశాడు.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్‌లో బౌలింగ్ చేసిన కోహ్లీ తన కెరీర్లో తొలి వికెట్‌ను తీశాడు. అనంతరం కోహ్లీ చూపించిన ఎక్స్ప్రెషన్ ఫ్యాన్స్‌కు నవ్వు తెప్పిస్తోంది. నాలుగో రోజు కోహ్లీ.. 170 బంతుల్లో 9 ఫోర్లతో శతకం నమోదు చేసి జోరుమీదున్న హరీ నీల్సన్ వికెట్ పడగొట్టాడు. వికెట్ తీసిన అనంతరం తన సహచర ఆటగాళ్లతో కలిసి సంబరాలు చేసుకున్నాడు.
ఈ ఫోటోను బీసీసీఐ షేర్ చేసింది. అంతేగాదు సారథి వికెట్ తీసిన వేళ అంటూ కామెంట్ చేయగా ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మ్యాచ్‌లో మొత్తం 7 ఓవర్లు వేసిన విరాట్.. 27 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు. డిసెంబర్ 6 నుంచి భారత్- ఆసీస్ మధ్య తొలిటెస్టు జరగనున్న సంగతి తెలిసిందే.