ఆర్‌ఆర్‌ఆర్‌లో ప్రియమణి…!

312
priyamani
- Advertisement -

టాలీవుడ్‌లో స్టార్‌ హీరోలు ఎన్టీఆర్‌ అభిమానులు, రామ్‌చరణ్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇటీవల రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాగా రాంచరణ్‌,ఎన్టీఆర్‌ మధ్య సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు జక్కన్న.

ఇక ఈ సినిమాలో నటించే హీరోయిన్లపై రోజుకో వార్త టీ టౌన్‌లో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే కీర్తి సురేశ్, రష్మిక, సమంత ఈ క్రేజీ ప్రాజెక్టులో నటించనున్నారని వార్తలు వెలువడుతుండగా తాజాగా మరో హీరోయిన్ పేరు ప్రచారంలోకి వచ్చింది. ఆర్‌ఆర్‌ఆర్‌లో నటించడానికి ప్రియమణి ఒప్పుకుందని ప్రచారం జరుగుతోంది. కథ నచ్చడంతో ప్రియమణి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రియమణి చేతిలో ఆరు సినిమాలున్నాయి. అయితే ఈ క్రేజీ ప్రాజెక్టులో నటించనున్నా అనే వార్తలపై ఆమె ఇంతవరకు స్పందించలేదు. ఈ సినిమాకు రామ రావణ రాజ్యం అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై దానయ్య ఈ సినిమాను నిర్మిస్తుండగా ఎమ్‌.ఎమ్‌. కీరవాణి బాణీలు అందిస్తున్నారు. హైదరాబాద్‌ శివార్లలో ఏర్పాటు చేసిన భారీ సెట్‌లో యాక్షన్‌ ఘట్టాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలిసింది.

- Advertisement -