కోహ్లీ @ విజ్డన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌

207
kohli
- Advertisement -

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి వరుసగా రెండోసారి విజ్డన్ క్రికెటర్ ఇఫ్ ద ఇయర్‌ అవార్డుకు ఎంపికయ్యాడు. కోహ్లీతో పాటు భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ సైతం ఈ అవార్డుకు ఎంపికైంది.

అత్యంత విజయవంతమైన ఇంటర్నేషనల్ క్రికెటర్‌గా కోహ్లీ నిలవడంతో ఈ అవార్డు వరించింది. టెస్టు,వన్డే,టీ20లు కలిపి 2818 పరుగులతో ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు.

Virat Kohli Wisden’s cricketers of the year

భారత జట్టును మహిళల ప్రపంచకప్ ఫైనల్ వరకు తీసుకెళ్లిన మిథాలీ రాజ్ మహిళల విభాగంలో వన్డేల్లో ఆల్‌టైమ్ లీడింగ్ రన్-స్కోరర్‌గా నిలిచింది. అలాగే వరుసగా ఏడు అర్ధశతకాలు నమోదు చేసిన ఏకైక మహిళా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.

వరల్డ్‌కప్ గెలిచిన ఇంగ్లాండ్ విమెన్స్ టీమ్‌లో ముగ్గురు క్రీడాకారిణులు అన్యా శ్రుబోస్లే, కెప్టెన్ హీదర్ నైట్, ఆల్‌రౌండర్ నటాలీ సీవెర్‌లకు ఈ జాబితాలో చోటు దక్కింది.

- Advertisement -