విరాట్ కోహ్లీ టీమిండియాకు తిరుగులేని విజయాలను అందిస్తూ సక్సెస్ ఫుల్ కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్నాడు. క్రీజులో అడుగుపెడితే పరుగుల వరద పారించడమే కాదు సంపాదనలోనూ తనకు తిరుగులేదని నిరూపించాడు కోహ్లీ. దేశంలో అత్యంత విలువైన సెలబ్రిటీ బ్రాండ్‌గా నిలిచాడు విరాట్.
2018లో కోహ్లీ బ్రాండ్ విలువ 18 శాతం పెరిగి 170.8 మిలియన్ డాలర్లకు (సుమారు రూ.1200 కోట్లు) చేరింది. నవంబర్ 2018 నాటికి కోహ్లీ మొత్తం 24 బ్రాండ్లతో ఒప్పందం చేసుకున్నాడు.
కోహ్లీ తర్వాత ఆ జాబితాలో దీపికా పదుకొనె ఉన్నారు. 2018లో దీపికా సంపాదన 102.5 మిలియన్ డాలర్లు (సుమారు
రూ.722 కోట్లు). దీపికా ఖాతాలో 21 బ్రాండ్లు ఉన్నాయి. ఈ జాబితాలో ఉన్న మొత్తం 20 సెలబ్రిటీ బ్రాండ్ల విలువ 877 మిలియన్ డాలర్లు (సుమారు రూ.6180 కోట్లు).
బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, రణ్‌వీర్ సింగ్ తమ ర్యాంకింగ్‌ను మెరుగుపరుచుకున్నారు. వరసగా 67.3 మిలియన్
డాలర్లు (సుమారు రూ.474 కోట్లు), 63 మిలియన్ డాలర్ల (సుమారు రూ.443 కోట్లు) సంపాదనతో వీరిద్దరూ మూడు, నాలుగు స్థానాలను ఆక్రమించారు. ఇదిలా ఉంటే, 2017లో రెండో స్థానంలో ఉన్న షారుఖ్ ఖాన్ ఐదో స్థానానికి పడిపోయాడు. అతని బ్రాండ్ విలువ 60.7 మిలియన్ డాలర్లకు (సుమారు రూ.427 కోట్లు) పడిపోయింది.